ఈ మొక్కలతో హానికారక కీటకాలు దూరం
- August 18, 2015
మొక్కలు పెంచుకుంటే మనసుకు ఆహ్లాదం, ముంగిట అందం ఇదంతా తెలిసిందే. అయితే కొన్ని రకాల మొక్కలు విచిత్రంగా మనకి హాని కల్గించే కీటకాల్ని దూరం చెయ్యడానికి కూడా ఉపయోగపడతాయి. వాటిలో ముఖ్యమైనవి తులసి, పుదీనా, మెంతి, బంతి, మందారం మొదలయినవి. తులసిని పూజ కోసం గుమ్మం ముందు ఉంచి పూజిస్తుంటాం. కేవలం పూజకే కాక ఔషధంగా ఉపయోగపడుతుందని తెలుసు. కానీ తులసి మొక్క ఇంటి గుమ్మంలో ఉంటే కొన్ని రకాల హానికారక కీటకాలు ఇంట్లోకి రాకుండా ఉంటాయట. అలాగే పుదీనా వాసన మనకెంతో ఇష్టం. కానీ కీటకాలకు దీని వాసన పడదట. ఆ ఘాటైన వాసనకు భయపడి కొన్ని హానికారక దోమలు, ఈగలూ ఇంట్లోకి చొరబడకుండా ఉంటాయట. దోమల్ని, ఈగల్ని పారదోలడంలో నిమ్మగడ్డి కీలకపాత్ర వహిస్తుంది. దీన్ని ఇంటి ముంగిట హ్యాంగ్ చేస్తే చాలా మంచిది. అలాగే బంతి మొక్క. ఇది గుమ్మంలో ఉంటే ఇంటికి ఎంతో ఆందాన్నివ్వడమే కాకుండా, బంతి వాసన మనకు ఎంతో ఆహ్లాదాన్నిస్తుంది. కానీ కీటకాలకు వికారం తెప్పిస్తుంది. అందుకే అవి దరి చేరవు. కాబట్టి మన పెద్దవాళ్లు పూజటకీ, పండగలకీ బంతి పూల తోరణాలు గుమ్మాలకి కట్టి అలంకరిస్తుంటారు. ఇది కేవలం అలంకారమే కాదు ఆరోగ్యం కూడా.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







