ఢిల్లీలో యూఏఈ వీసా జారీ కేంద్రం

- October 18, 2016 , by Maagulf
ఢిల్లీలో యూఏఈ వీసా జారీ కేంద్రం

న్యూఢిల్లీ: కొత్త ఓవర్‌సీస్‌ కాన్సులర్‌ సెక్షన్‌ని వీసా మంజూరు కోసం యూఏఈ ఢిల్లీలో ఏర్పాటు చేసింది. కాన్సులర్‌ సెక్షన్‌, ఎమిరేటీ వీసాల్ని ఇండియన్స్‌ మరియు ఇండియాలో నివసిస్తున్నవారి కోసం మంజూరు చేయనుంది. యూఏఈలోని ఇండియన్‌ వర్కర్స్‌కి ఇది ఎంతో ఉపయుక్తంగా ఉండనుంది. యూఏఈకి సంబంధించినంతవరకు ఇది ఆరవ ఓవర్‌సీస్‌ సెంటర్‌. మినిస్ట్రీ ఆఫ్‌ ఫారిన్‌ ఎఫైర్స్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ కో-ఆపరేషన్‌ మొహమ్మద్‌ మిర్‌ అబ్దుల్లా అల్‌ రైసి ఈ సెంటర్‌ని ప్రారంభించారు. ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ నజీబ్‌ జంగ్‌, పలువురు ఎమిరేటీ మరియు ఇండియన్‌ అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. యూఏఈ మరియు ఇండియా మధ్య సంబంధాలు మరింతగా విస్తరించేందుకు ఇరు ప్రభుత్వాలూ ఎంతో ఆసక్తి చూపుతున్నాయని ఈ సందర్భంగా అల్‌ రైసి చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com