పవన్‌కల్యాణ్ దర్శకుడు త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో మూడవ చిత్రం ..

- October 18, 2016 , by Maagulf
పవన్‌కల్యాణ్ దర్శకుడు త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో మూడవ చిత్రం ..

పవన్‌కల్యాణ్ దర్శకుడు త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో మూడవ చిత్రం చేయడానికి వీరిద్దరూ రెడీ అవుతున్న న్యూస్ పవన్ అభిమానులకు జోష్ ను కలిగిస్తోంది. అయితే ఈమూవీ ప్రాజెక్ట్ కోసం త్రివిక్రమ్ చేస్తున్న సాహసానికి సంబంధించిన వార్తలు విని పవన్ అభిమానులు విపరీతమైన టెన్షన్ పడుతున్నట్లు టాక్.ఈసినిమాకు 'వై దిస్ కొలవెరి డీ' ఫేమ్ అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంపిక అయిన విషయం పవన్ అభిమానులకు ఏ మాత్రం నచ్చడం లేదు అని వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం అనిరుధ్ ఆ మధ్య బీప్ సాంగ్ అంటూ ఒక బూతు పాటను ట్యూన్ చేసి కోలీవుడ్ లో విపరీతమైన విమర్శలు ఎదుర్కోవడమే కాకుండా తమిళనాడులోని మహిళా సంఘాల తీవ్ర ఆగ్రహానికి కారణమైన ఇలాంటి వివాదాల సంగీత దర్శకుడు తప్ప మరెవ్వరూ త్రివిక్రమ్ శ్రీనివాస్ కు కనపడ లేదా అంటూ పవన్ అభిమానులు గగ్గోలు పెడుతున్నట్లు టాక్.ఈ సాంగ్ వివాదం కారణంగానే అనిరుధ్ గతంలో త్రివిక్రమ్ తో చేయాల్సిన 'అ..ఆ' ప్రాజెక్టు నుండి బయటకు వచ్చిన నేపధ్యంలో మళ్ళీ త్రివిక్రమ్ ఏరికోరి ఈ మ్యూజిక్ డైరెక్టర్ పై ఎందుకు మనసు పడ్డాడో తెలియక పవన్ అభిమానులు తల పట్టుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ పవన్ త్రివిక్రమ్ ల కాంబినేషన్ ఇప్పటికే రెండు సార్లు ఘన విజయం సాధించిన నేపధ్యంలో దేవిశ్రీని ఈ ప్రాజెక్ట్ విషయంలో ఎందుకు తప్పించారు అన్న అనుమానాలు పవన్ అభిమానులు వ్యక్త పరుస్తున్నట్లు తెలుస్తోంది.ఈ వార్తలు ఇలా ఉండగా ఈమూవీ స్క్రిప్ట్ ఇంచుమించు పూర్తి అయిన నేపధ్యంలో ఈసినిమా పాటల ట్యూనింగ్ పై త్రివిక్రమ్ అనిరుధ్ లు దృష్టి పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈసినిమాకు కథకు తగ్గట్టుగా ఇప్పటికే పాటలు వ్రాయించిన త్రివిక్రమ్ అనిరుధ్ తో మంచి ట్యూనింగ్స్ ఇప్పించడానికి అప్పుడే చెన్నైలోని ఒక ప్రముఖ మ్యూజిక్ రికార్డింగ్ ధియేటర్ లో ఈ సినిమా పాటలకు సంబంధించిన ట్యూన్స్ ఎంపిక క్రార్యక్రమం జరుగుతోంది అన్న వార్తలు వస్తున్నాయి.'అత్తారింటికి దారేది' భారీ విజయం తరువాత పవన్ త్రివిక్రమ్ ల కాంబినేషన్ తో రాబోతున్న ఈసినిమాకు 'దేవుడే దిగి వచ్చినా' అన్న టైటిల్ ఫిక్స్ చేసినట్లుగా ఇప్పటికే వార్తలు ఉన్నాయి. 'త్రివిక్రమ్ 'అఆ' కి సంగీతం అందించే చాన్స్ నాకే వచ్చింది. మిస్ చేసుకున్నా. పవన్ హీరోగా ఆయన దర్శకత్వంలో రూపొందబోయే తాజా చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం కాబోతున్నా. ఎవరూ ఊహించనంత కొత్తగా ఉంటుందీ సినిమా' అని అనిరుధ్ చెప్పడo బట్టి పవన్ అభిమానుల భయాలను లెక్క చేయకుండా త్రివిక్రమ్ ఈ విషయంలో ఏక పక్ష నిర్ణయం తీసుకున్నట్లుగానే కనిపిస్తోంది..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com