బహ్రెయిన్ ఇండియా వీక్ 2016
- October 19, 2016
డిసెంబర్ 1న బహ్రెయిన్ ఇండియా వీక్ పేరుతో రెండు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు మరింత పెరిగేందుకు ఓ గ్రాండ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు బహ్రెయిన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (బిసిసిఐ) వెల్లడించింది. ఇరుదేశాల్లోని పలు ప్రముఖ సంస్థలు ఈ ఈవెంట్‌లో పాల్గొని, ఇరు దేశాల్లోనూ చేపట్టే పలు ప్రాజెక్టులపై చర్చించుకుంటాయని ప్రతినిథులు స్పష్టం చేశారు. బి టు బి ఎగ్జిబిషన్ డిసెంబర్ 1 మరియు 2 తేదీల్లో బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్‌లోని 2వ హాల్‌లో జరుగుతుంది. ఈ ఈవెంట్ ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్సటర్నల్ ఎఫైర్స్ అలాగే ఎంబసీ ఆఫ్ ఇండియా ఇన్ బహ్రెయిన్, బహ్రెయిన్ మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీ, కామర్స్ మరియు టూరిజం మద్దతుతో నిర్వహించబడుతోంది. బహ్రెయిన్‌కి చెందిన పిఆర్‌ఎం మార్కెటింగ్ కన్సల్టెన్సీ ఈ ఈవెంట్‌ని నిర్వహిస్తోంది. ఎస్‌ఎంఇ మరియు మాన్యుఫ్యాక్చరింగ్ రంగాల్లో టెక్నాలజీ మార్పిడిపై బి టు బి ఫోకస్ పెట్టనుంది. ఈ ఈవెంట్‌లో ఫుడ్ కోర్ట్‌ని కూడా ఏర్పాటు చేస్తున్నారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







