తల్లి పేర్లతో టైటిల్ కార్డ్స్.....
- October 19, 2016
నందమూరి సింహం బాలకృష్ణ తన ఇంటి పేరును తలుచు కోకుండా తన తండ్రి వారసత్వం గురించి గొప్పలు చెప్పుకోకుండా ఒక్క క్షణం కూడ ఉండలేడు. ఇప్పటి వరకు 99 సినిమాలలో టైటిల్ కార్డ్స్ లో కనిపించిన బాలకృష్ణ పేరు బాలయ్య 100వ సినిమాలో చాల డిఫరెంట్ గా కనిపించబోతోంది.బాలకృష్ణ లేటెస్ట్ గా నటిస్తున్న 'గౌతమీపుత్ర శాతకర్ణి' సినిమా టైటిల్ కార్డ్స్ లో బాలకృష్ణ పేరును నందమూరి బాలకృష్ణగా కాకుండా బసవతారక పుత్ర బాలకృష్ణగా చూపించబోతున్నారు. ఇప్పటికే ఈసినిమా ఫస్ట్ లుక్ లో ఇలా బాలయ్య పేరును డిజైన్ చేసిన డైరెక్టర్ క్రిష్ ఇదే పద్ధతిని 'గౌతమీపుత్ర శాతకర్ణి' టైటిల్స్ విషయంలో కూడ అనుసరించాలని ఒక స్థిర నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.2వ శతాభ్దానికి చెందిన ఈ సినిమా కథ జరిగే కాలంలో అప్పటి ప్రజలు అంతా తమ తండ్రి ఇంటి పేరు కoటే తల్లి పేరుకు ప్రాధాన్యం ఇవ్వడమే కాకుండా ఆ పేరును తమ పేరులో ఇముడ్చుకునే వారు. అంతేకాదు తమ పేరుకు ముందు తల్లి పేరును పెట్టుకుని ఆమె పై తమ గౌరవాన్ని చాటుకునేవారు.అయితే ఈ విషయాలు అన్నీ శతాబ్దాలు మారిపోయి పురుషాధిపత్యం పెరిగిపోయి స్త్రీల ఔనత్యం తగ్గిపోయిన రోజులలో తిరిగి బాలకృష్ణ క్రిష్ లు చేస్తున్న ఈ ప్రయత్నానికి అందరూ తమ హర్షాన్ని తెలియచేస్తున్నారు. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న క్రిష్ కూడ ఈసినిమా టైటిల్ కార్డ్స్ లో తన పేరును అంజనాపుత్ర క్రిష్ గా వేసుకోబోతూ ఉండటం మరో ట్విస్ట్.అంతేకాదు ఈ సినిమా టైటిల్ కార్డ్స్ లో ఈసినిమాలో నటిస్తున్న అందరి నటీనటుల పేర్లు ముందు అదేవిధంగా ఈసినిమాకు పనిచేసిన టెక్నిషియన్స్ పేర్ల ముందు వారి ఇంటి పేర్లు కాకుండా వారి తల్లి పేర్లతో టైటిల్ కార్డ్స్ లో చూపెట్ట బోతున్నారు. ఇటువంటి చారిత్రాత్మక సినిమా తీయడమే ఒక సాహసం అనుకుంటే ఇటువంటి టైటిల్ కార్డ్స్ ప్రయోగానికి తెర తీసిన సినిమాగా 'గౌతమీపుత్ర శాతకర్ణి' చరిత్ర సృష్టించ బోతోంది..
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









