ఐసిస్ కథ అడ్డం తిరిగింది...
- October 19, 2016
తన అధీనంలోని భూభాగం తరిగిపోతోంటే ఉగ్రసంస్థ ఐసిస్‌కు ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. దీంతో ఆల్‌ఖైదా మాదిరిగా బలవంతపు వసూళ్లు, అపహరణలు, విరాళాల సేకరణపై దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. ఇరాక్, సిరియాల్లోని సహజ వనరులు, తమ ఏలుబడిలో ఉన్న పట్టణాల్లో పన్ను విధించడమే సంస్థకు ఆదాయ వనరులు. కొంతకాలంగా మోసుల్ పట్టణాన్ని తిరిగి చేజిక్కించుకోవడానికి ఇరాకీ సేనలు యుద్ధం మొదలుపెట్టడంతో ఐసిస్ కథ అడ్డం తిరిగింది. ఆదాయం గణనీయంగా పడిపోయింది. అక్కడి చమురు, నగదు నిల్వల ద్వారా సమకూరే బిలియన్ల డాలర్ల ఆదాయాన్ని క్రమంగా కోల్పోతోంది.2015లో ఇరాక్‌లో పన్నులు, బలవంతపు వసూళ్ల వల్ల ఐసిస్ నెలకు 30 మిలియన్ డాలర్ల ఆదాయం ఆర్జించింది.ఒక్క మొసూల్ పట్టణంలోనే పన్నుల ద్వారా నెలకు సుమారు 4 మిలియన్ల ఆదాయం సమకూరుతోంది. బ్యాంకు దొంగతనాలు సంస్థకు మూడో అతిపెద్ద ఆర్థిక వనరులుగా ఉన్నాయి. మొసూల్‌ను ఆక్రమించిన కొత్తలో అక్కడి ప్రభుత్వ బ్యాంకుల్లో ఉన్న 500 మిలియన్ డాలర్లను ఐసిస్ ఒకేసారి దొంగిలించింది. ఆర్థిక పరిమితుల దృష్ట్యా ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఐసిస్ పోరాటదారుల వేతనాలు సగానికి తగ్గాయి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







