అమ్మాయికి అబ్బాయి వీసా

- October 20, 2016 , by Maagulf
అమ్మాయికి అబ్బాయి వీసా

దుబాయ్‌: భారతీయ వలసదారుడొకరు, తన కుమార్తె పాస్‌పోర్ట్‌పై 'అబ్బాయి'గా స్టాపింగ్‌ జరగడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. రెసిడెన్సీ వీసాని రెన్యువల్‌ చేసే క్రమంలో దొర్లిన ఈ తప్పును గురించి వివరిస్తూ, కొరియర్‌ ద్వారా అందిన పాస్‌పోర్ట్‌ చూడగానే షాక్‌కి గురయినట్లు తెలిపాడు అతీక్‌ అహ్మద్‌. ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న అహ్మద్‌, జరిగిన తప్పుపై జనరల్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెసిడెన్సీ మరియు ఫారిన్‌ ఎఫైర్స్‌ (జిడిఆర్‌ఎఫ్‌ఎ) కాల్‌ సెంటర్‌ని సంప్రదించి విషయాన్ని తెలియజేశాడు. తనకు జరిగిన ఈ అన్యాయం ఇంకెవరికీ జరగకూడదనీ, ప్రతి ఒక్కరూ ఇలాంటి తప్పుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని అహ్మద్‌ విజ్ఞప్తి చేశాడు. ఇంకో వైపున అధికారులు జరిగిన తప్పుపై చింతిస్తూ, వీలైనంత త్వరగా తప్పుని సరిదిద్దుతామని పేర్కొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com