హైదరాబాద్‌లో 'సింగం-3' షూటింగ్ పూర్తి

- October 20, 2016 , by Maagulf
హైదరాబాద్‌లో 'సింగం-3' షూటింగ్ పూర్తి

ప్రముఖ కథానాయకుడు సూర్య నటిస్తున్న తాజా చిత్రం 'సింగం-3'. గతంలో వచ్చిన సింగం, సింగం-2 చిత్రాలు విజయాలు సాధించాయి. సింగం సిరీస్‌లో భాగంగా హరి దర్శకత్వంలో తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న సీక్వెల్‌ సింగం-3పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. తమిళ్‌లో స్టూడియో గ్రీన్‌ అధినేత కె.ఇ. జ్ఞానవేల్‌ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో ప్రముఖ నిర్మాత సురక్ష్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ మీడియా అధినేత మల్కాపురం శివకుమార్‌ నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్ర విశేషాలను తెలియజేస్తూ... ఈ చిత్రానికి రెండు భాషల్లో క్రేజ్‌ వుంది. అందరి అంచనాలను అందుకుంటుందని నమ్మకం వుంది. సూర్య సరసన అనుష్క, శతి హాసన్‌ నాయికలుగా నటిస్తున్నారు.

ఇటీవల హైదరాబాద్‌లో ప్రారంభమైన షెడ్యూల్‌ నేటితో పూర్తయ్యింది. దీంతో టాకీ పార్ట్‌ పూర్తయ్యింది. మిగిలి వున్న ఒక పాటను సూర్య, అనుష్క పై విదేశాల్లో త్వరలో చిత్రీకరిస్తూ షూటింగ్‌ పూర్తవుతుంది. దీపావళికి టీజర్‌, నవంబర్‌లో ఆడియోని విడుదల చేసి డిసెంబర్‌ 16న భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం.

తెలుగు నేటివిటికి దగ్గరగా వుండే ఈ చిత్ర నేపథ్యంలో తెలుగు ప్రేక్షకులకు నచ్చే అన్ని అంశాలుంటాయి. వైజాగ్‌లో ప్రారంభమైన ఈ చిత్ర షూటింగ్‌ హైదరాబాద్‌లో జరిగిన షెడ్యూల్‌తో పూర్తి చేసుకోవడం విశేషం. ఇప్పటికే తెలుగులో ఈ చిత్రానికి సంబంధించి అన్ని ఏరియాల్లో ఫ్యాన్సీ రేట్లతో బిజినెస్‌ పూర్తయిందని అన్నారు. ఇంకా రాధిక శరత్‌కుమార్‌, నాజర్‌, రాడాన్‌ రవి, సుమిత్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:హేరీస్‌జైరాజ్‌.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com