ఈ నెల 27న విడుదల కానున్న 'ఎంత వరకు ఈ ప్రేమ' ఆడియో
- October 20, 2016
జీవా హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్గా రూపొందుతోన్న రొమాంటిక్ కామెడి ఎంటర్ టైనర్ 'కవలై వేండాం'. ఈ చిత్రాన్ని తెలుగులో 'ఎంత వరకు ఈ ప్రేమ'గా విడుదల చేస్తున్నారు. 'యామిరుక్క బయమేన్' ఫేమ్ డీకే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. లియోన్ జేమ్స్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమాన్ని ఈనెల 27న విడుదల చేస్తున్నారు.
నిర్మాత డి.వెంకటేష్ మాట్లాడుతూ..'రంగం' ద్వారా గుర్తింపు పొందిన జీవా, స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కాంబినేషన్ అంటేనే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.
లియోన్ జేమ్స్ సంగీతం అందించిన పాటలు తమిళంలో విడుదలైన సక్సెస్ను సాధించాయి. తెలుగు ఆడియోను ఈనెల 27న నిర్వహిస్తున్నాం. సినిమాను రెండు భాషల్లో ఒకేసారి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అన్నారు.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









