సైకిళ్ళపై పెట్రోలింగ్‌ని ప్రారంభించిన పోలీస్
- October 20, 2016
అబుదాబీ పోలీసులు, సైకిల్ పెట్రోల్ టీమ్స్‌ని పునరుద్ధరించాయి. రెసిడెన్షియల్ మరియు కమర్షియల్ ప్రాంతాల్లో ఈ సైకిల్ పెట్రోల్ టీమ్స్ తమ సేవల్ని సమర్థవంతంగా నిర్వహించనున్నాయి. త్వరలో ఈ సేవల్ని మరింతగా విస్తరిస్తామని అబుదాబీ పోలీస్ వర్గాలు వెల్లడించాయి. పూర్తిస్థాయిలో ఎక్విప్మెంట్తో కూడిన పెట్రోల్ టీమ్ సైకిల్స్‌పై విదులను నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. అబుదాబీ పోలీస్ చీఫ్ కమాండర్ మేజర్ జనరల్ మొహమ్మద్ ఖల్ఫాన్ అల్ రుమైతి మాట్లాడుతూ, అబుదాబీ పోలీసులు మరిన్ని మెరుగైన సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారనీ, సొసైటీలో భద్రత అలాగే శాంతికి కట్టుబడి ఉన్నామని అన్నారు. నేరాల్ని తగ్గించడంలో ఈ సైకిల్ పెట్రోల్ టీమ్స్ ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని వివరించారాయన. 'వి ఆర్ ఆల్ పోలీస్', 'హార్స్ నైట్స్' వంటి విభిన్నమైన కార్యక్రమాలతో అబుదాబీ పోలీసులు ప్రజలకు మరింత చేరువవుతున్నారు.
తాజా వార్తలు
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ అధ్యయన పర్యటనలో పాల్గొననున్న �
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!







