పాటల పోటీలో పాల్గొననున్న 4,000 మంది యు. ఏ. ఈ. కార్మికులు

- August 20, 2015 , by Maagulf
పాటల పోటీలో పాల్గొననున్న 4,000 మంది యు. ఏ. ఈ. కార్మికులు

యు. ఏ. ఈ లోనున్న వేలాది కార్మికుల ముఖాల్లో సంతోషం పూయించే, జులై 23 న ప్రారంభమైన " క్యాంప్ కా ఛాంప్" పాటల పోటీ యొక్క 9వ ఎడిషన్ లో 140 శ్రామిక వసతిగృహాలనుండి 4,000 మందికి పైగా పోటీదారులు పాల్గొననున్నారు. 2007 సంవత్సరంలో కేవలం మూడు కంపెనీలు మాత్రమే పాల్గొన్న ఈ పోటీలో ఇప్పుడు 24 కంపెనీలు పాల్గొంటున్నాయి.  ఈ పలు విడతల కార్యక్రమం లో  విజేతలకు డ్యూ వారినుండి 50,000 దీనర్లు , వెస్టర్న్ యూనియన్ వారి  నుండి బంగారం,  గీపాస్ వారినుండి ఎలక్ట్రానిక్ సామగ్రి, ఏర్ అరేబియా వారినుండి విమాన టికెట్లు బహుమతులుగా అందుతాయి! 


--సి.శ్రీ(దుబాయ్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com