ఒప్పందాన్ని అతిక్రమించినందుకు పాక్ కు బుద్ధి చెప్పిన భారత్ జవ్వాన్లు
- October 21, 2016
భారత్ - పాక్ సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాకిస్తాన్ రేంజర్లకు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) జవాన్లు శుక్రవారం నాడు గట్టి షాక్ ఇచ్చారు. పాక్ ఎప్పటికప్పుడు ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. తాజాగా, ఈ రోజు జమ్ములోని హీరా నగర్ సెక్టారులో బీఎస్ఎఫ్ పోస్టుల పైన పాకిస్తాన్ సైన్యం కాల్పులకు తెగబడింది. దీంతో రంగంలోకి దిగిన భారత్ ఆర్మీ పాక్ సైన్యం కాల్పులను ధీటుగా ఎదుర్కొంది. బీఎస్ఎఫ్ దళాలు జరిపిన కాల్పుల్లో ఒక ఉగ్రవాది, ఏడుగురు పాక్ రేంజర్లు హతమయ్యారు. తద్వారా, సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచిన పాకిస్థాన్‌కు భారత బలగాలు దిమ్మతిరిగే సమాధానం చెప్పాయి. కాగా, ఈ ఘటనలో ఓ బీఎస్ఎఫ్ జవానుకు గాయపడ్డాడు. కాగా, ఇండియన్ ఆర్మీకి కేంద్రం పూర్తి స్వేచ్ఛను ఇచ్చిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







