హై ఓల్టేజ్ 'శ్రియా ఘోషల్' లైవ్ కాన్సెర్ట్
- October 22, 2016
భారతీయ సినీ సంగీత ప్రియులకు పరిచయం అక్కర్లేని పేరు ఆమెది. మెలోడీ క్వీన్‌గా దేశవ్యాప్త గుర్తింపు దక్కించుకున్న ప్రముఖ గాయని శ్రియా ఘోషల్, దుబాయ్‌లో నిర్వహించనున్న లైవ్ కాన్సెర్ట్‌లో సందడి చేసింది. నెస్లె మంచ్ సమర్పిస్తోన్న ఈ కార్యక్రమం అక్టోబర్ 21న అంగరంగ వైభవంగా జరిగింది. రాత్రి 8.30 నిమిషాలకు ప్రారంభమైన లైవ్ కాన్సెర్ట్ సినీ సంగీత ప్రియుల్ని మరో ప్రపంచానికి తీసుకెళ్ళిందనడం అతిశయోక్తి కాదు. దుబాయ్ డ్యూటీ ఫ్రీ టెన్నిస్ స్టేడియంలో జరిగిన ఈ హై ఓల్టేజ్ లైవ్ కాన్సెర్ట్‌కి పెద్ద సంఖ్యలో ఔత్సాహికులు హాజరయ్యారు. పలు బాలీవుడ్ చిత్రాల్లోని పాటల్ని ఆలపించిన శ్రియా ఘోషల్, సంగీతాభిమానుల మనసుల్ని దోచుకుంది. ఆమె పాటలకు ఆహూతులు మైమర్చిపోయారు.ఈ ఈవెంట్ కి సైయద్ ఫహద్(PR & Social Media) ప్రచారకర్తగా వ్యవహరించారు.


తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









