పెదాలు అందంగా ఎర్రగా మెరవాలంటే
- August 20, 2015
శరీరంలో తగినంత వాటర్ లేకపోతే పెదాలు తెల్లగా పాలిపోయి, ఎండిపోయినట్లుగా అయిపోతాయి. అందుకే తగినంత వాటర్ తాగుతూ ఉండాలి. ఇంకా దీంతో పాటు మన ఇంట్లో లభించే ప్రొడక్ట్స్తోనే లిప్స్ ఎర్రగా మెరిపించుకోవచ్చు. బాదం నూనెలో గులాబీ రేకల పొడి వేసి గాలి చొరబడని డబ్బాలో ఉంచి భద్రపరుచుకోవాలి. దీన్ని ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు పెదాలకు రాసుకుని మర్దన చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పెదాలు గులాబీ రంగులోకి మారడమే కాకుండా పొడిబారడం, పగలడంలాంటి సమస్యలు కూడా తగ్గుతాయి. చక్కెరా, పాలూ, తేనె కలిపిన మిశ్రమాన్ని పెదాలకు రాసి ఒక ఇరవై నిముషాలు మర్దన చేసుకుని ఆరిపోయాక కాటన్‌తో సున్నితంగా తుడుచుకోవాలి. ఇలా చేయడం వల్ల పెదాలపై ఉన్న మృత కణాలు తొలగిపోయి గులాబీ రంగులో అందంగా మెరుస్తాయి. ఇలా చేసిన తరువాత కొద్దిగా గాఢత తక్కువ ఉన్న లిప్ బామ్స్ వాడితే మరింత అందమైన పెదాలు మీ సొంతం.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







