కార్న్‌ప్లేక్స్ రొయ్యల ఫ్రై
- August 20, 2015
కావలిసిన పదార్ధాలు
రొయ్యలు - పావుకిలో
మైదా - ఒక కప్పు
కార్న్‌ప్లోర్ - ఒక కప్పు
బ్రెడ్ పొడి, కొబ్బరి పొడి - ఒక చెంచా చొప్పున
కరివేపాకు - కొద్దిగా
ఎండుమిర్చి - నాలుగు
కార్న్ ప్లేక్స్ - ఒక కప్పు
ఉప్పు - తగినంత
నూనె - సరిపడా
గుడ్డు - ఒకటి
నిమ్మకాయ - ఒకటి
అల్లం వెల్లుల్లి తరుగు - ఒక స్పూను
తయారీ విధానం
ముందుగా రొయ్యల్ని శుభ్రంగా కడిగి వాటికి నిమ్మకాయ, ఉప్పు కలిపి పక్కన ఉంచాలి. దానిలో గిలక్కొట్టిన గుడ్డు సొన కూడా కలిపి, తరువాత కార్న్ ప్లోర్, మైదాపిండి, కొత్తిమీర తురుము, అల్లం వెల్లుల్లి ముద్ద, కొద్దిగా గరం మసాలా వేసి బాగ కలిపి వేయించిన నూనెలో గోధుమ రంగు వచ్చేవరకూ వేయించి, ఒక టిష్యూ మీద వేసి నూనె పోయేదాకా ఉంచాలి. ఆ తరువాత నాన్ స్టిక్ పాన్ తీసుకొని కొద్దిగా నూనె వేసి, దానిలో సన్నగా తరిగిన వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి, కొబ్బరిపొడి, బ్రెడ్ పొడి వేసి చివరిగా చిన్నగా చిదిమిన కార్న్‌ఫ్లేక్స్ వేసి కొద్దిగా వేయించి, తరువాత వేయించి పెట్టుకున్న రొయ్యలను కూడా వేసి కొంచెం అటూ ఇటూ కలిపి తీసేస్తే కార్న్‌ఫ్లేక్స్ రొయ్యల ఫ్రై రెడీ.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్‌లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







