2వ షెడ్యూల్ పూర్తి చేసుకున్న 'శ్రీ సత్యసాయి బాబా'
- October 23, 2016
సౌభాగ్య చిత్ర పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం `శ్రీ సత్యసాయి బాబా`. `అమ్మోరు`, `అరుంధతి`, `దేవుళ్లు` వంటి విజువల్ వండర్స్‌ని అందించిన కోడి రామకృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. `దేవుళ్లు` నిర్మాత కరాటం రాంబాబు నిర్మిస్తున్నారు. పుట్టపర్తి సత్యసాయి బాబాపై తెరకెక్కిస్తున్న సేవా ధృక్పథ భక్తి చిత్రమిది. మ్యాస్ట్రో ఇళయరాజా స్వరాల్ని అందిస్తున్నారు. జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు సింగిల్ కార్డ్‌లో 14 పాటలకు సాహిత్యం అందించడం విశేషం. ఇటీవలే మొదటి షెడ్యూల్ పూర్తయింది. అక్టోబర్ 14 నుంచి 2వ షెడ్యూల్ చిత్రీకరణ అల్లూమినియం ఫ్యాక్టరీ, సారథి స్టూడియోస్‌లో వేసిన భారీ సెట్స్‌లో తెరకెక్కించారు. తాజా షెడ్యూల్ పూర్తయింది. ఈ షెడ్యూల్లో ప్రధాన పాత్రధారులపై కీలక సన్నివేశాలు తెరకెక్కించారు.
సత్యసాయిగా మలయాళ నటుడు శ్రీజిత్ విజయ్ నటిస్తున్నారు. సత్యసాయికి మాతృమూర్తి గా జయప్రద, తండ్రి పాత్రలో శరత్‌బాబు నటిస్తున్నారు. ఉలగనాయగన్ కమల్‌హాసన్‌కి మేకప్‌మేన్‌గా పనిచేసిన రమేష్ మెహంతి ఈ చిత్రానికి పని చేస్తున్నారు. ఇటీవలే పాటల రికార్డింగ్ పూర్తయింది. ఎస్.పి.బాలసుబ్రమణ్యం, వందేమాతరం శ్రీనివాస్, హరిహరన్, బాల మురళి కృష్ణ, చిత్ర, హరిచరణ్, విజయ్ ప్రకాష్, కవితా కృష్ణమూర్తి, కైలాస్ గురి, సుఖ్విందర్ సింగ్, మల్లాడి బ్రదర్స్, ఆండ్రియా, టిప్పు తదితరులు గానాలాపన చేశారు. ప్రఖ్యాత ఛాయాగ్రాహకుడు బి.వాసు ఈ చిత్రానికి ఛాయాగ్రహణం అందిస్తున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







