మరోసారి వెంకీ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన తేజస్విని
- October 23, 2016
ఒక్కసారి.. ఇంకొక్కసారి అంటూ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబును టీజ్ చేసిన తేజస్వి మదివాడ.. మరోసారి వెంకటేష్ తో కలిసి నటించే ఛాన్స్ కొట్టేసింది. సీతమ్మ సినిమా తర్వాత వెంకటేష్ తో కలిసి నటించే అవకాశాన్ని మరోసారి దక్కించుకుంది ఈ తెలుగు బ్యూటీ.బాబు బంగారం' సినిమా తరువాత నుంచి వెంకటేష్ బాబు కాస్త దూకుడు పెంచాడు. వరుసగా సినిమాలను అంగీకరించడమే కాకుండా, సాధ్యమైనంత త్వరగా వాటిని పూర్తిచేయడానికి కూడా ప్రయత్నిస్తున్నాడు. ఆయన తాజా చిత్రంగా 'గురు' రూపొందుతోంది.ఈ సినిమాను, సంక్రాంతికి విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.తరువాత ఆయన కిషోర్ తిరుమలతో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడు. ఈ సినిమాకి 'ఆడాళ్లూ మీకు జోహార్లు' అనే టైటిల్ ను ఖరారు చేశారు. కథాపరంగా ఇందులో నలుగురు కథానాయికలతో వెంకటేష్ రొమాన్స్ చేయనున్నాడట.ఒక హీరోయిన్ గా నిత్యామీనన్ ను .. మరోహీరోయిన్ గా అనసూయను సెలెక్ట్ చేసిన ఈ సినిమా టీమ్, తాజాగా 'తేజస్వి'ని మూడో హీరోయిన్ గా ఎంపిక చేసిందట.ఈ మూవీలో తన కంటే వయసులో చాలా చిన్నదైన అమ్మాయిని చేసుకోవాల్సి వచ్చే వ్యక్తిగా వెంకటేష్ నటించనున్నాడు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







