మీడియా నేపథ్యంలో సాగే కథ 'మనలో ఒకడు'
- October 24, 2016
కొన్ని యదార్థ ఘటనల ఆధారంగా 'మనలో ఒకడు' కథను రాసుకున్నామని, మీడియా నేపథ్యంలో సాగే కథ ఇదని ప్రధాన పాత్రధారి, దర్శకుడు ఆర్పీ.పట్నాయక్ పేర్కొన్నారు. యూనిక్రాఫ్ట్ మూవీస్ పతాకంపై జగన్మోహన్ నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సన్నద్ధమవుతోంది. 'నువ్వు నేను' ఫేమ్ అనితా.హెచ్.రెడ్డి కథానాయికగా నటించారు. కాగా ఈ చిత్రం గురించి ఆర్పీ.పట్నాయక్ తెలియజేస్తూ, 'ఈ సినిమాలో నేను కృష్ణమూర్తి అనే అధ్యాపకుడి పాత్రలో నటించాను. పవర్ఫుల్ పాత్ర అది. అలాగే సాయికుమార్ కూడా ఓ అద్భుతమైన పాత్రను పోషించారు. పాటలకు మంచి స్పందన రావడంతో ఇటీవల తిరుపతిలో వన్ మిలియన్ క్లిక్స్ డిస్క్ వేడుకను నిర్వహించాం.థియేట్రికల్ ట్రైలర్‌కు అనూహ్యమైన స్పందన లభించింది. తొలికాపీ సిద్ధమైన ఈ చిత్రానికి త్వరలో సెన్సార్ కార్యక్రమాలను పూర్తిగావించి నవంబర్ 4న సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం' అని చెప్పారు. నిర్మాత జగన్మోహన్ మాట్లాడుతూ, 'ప్రస్తుత సమాజంలో మీడియా పాత్ర ఏంటో అందరికీ తెలుసు. అలాంటి మీడియా నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది' అని అన్నారు.ఈ చిత్రానికి పాటలు: చైతన్యప్రసాద్, వనమాలి, పులగం చిన్నారాయణ, కెమెరా: ఎస్.జె.సిద్ధార్థ, సహ నిర్మాతలు: ఉమేశ్‌గౌడ్, బాలసుబ్రహ్మణ్యం.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







