ఒకరోజు ముందుగానే 'కాష్మోరా' రిలీజ్ !
- October 24, 2016
కార్తీ తాజా చిత్రం 'కాష్మోరా'. గోకుల్ దర్శకుడు. నయనతారా, దివ్య శ్రీ కథానాయికలు. ఫస్ట్ లుక్ తోనే కాష్మారో పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ట్రైలర్ తో ఆ అంచనాలు ఆకాశానంటాయి. ఇందులో కార్తీ మూడు పాత్రలో కనిపించనున్నాడు. ఈ పాత్రలు కూడా దేనికదే వైవిధ్యంగా ఉండనున్నాయట. దాదాపు 60కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు, తమిళ్ లోనూ రిలీజ్ కానుంది.ఈ చిత్రం దీపావఌకి కానుకగా ఈ నెల 29న రిలీజ్ చేయాలని భావించారు. అయితే, ఇప్పుడు అనుకున్నదాని కంటే ఒకరోజు ముందుగానే అంటే ఈ నెల 28న రిలీజ్ చేయనున్నారు. తెలుగు కార్తీకి మంచి మార్కెట్ ఉంది. ఈ యేడాది ప్రేక్షకుల ముందుకొచ్చిన నాగ్-కార్తీల మల్టీస్టారర్ ఊపిరి సూపర్ హిట్ గా నిలిచింది. కాష్మోరా కూడా తెలుగు ప్రేక్షకులని ఆకట్టుకుంటుందనే నమ్మకంతో ఉన్నాడు కార్తీ.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







