40, 60 వాట్స్ బల్బ్స్ అమ్మకాల నిలిపివేత
- October 24, 2016
ఖతార్‌లోని చాలా ఔట్లెట్స్ 40, 60 వాట్స్ ఇన్కాండిసెంట్ లైట్ బల్బ్స్ అమ్మకాల్ని పూర్తిగా నిలిపివేశాయి. నవంబర్ 1 నుంచి వీటిపై బ్యాన్ అమలు కానుండడంతో ముందస్తుగానే వీటి అమ్మకాలు నిలిపివేయబడ్డాయి. ఖతార్ జనరల్ ఆర్టనైజేషన్ ఫర్ స్టాండర్డ్స్ (ఖతార్ స్టాండర్డ్స్) మరియు మెట్రాలజీ - మినిస్ట్రీ ఆఫ్ మునిసిపాలిటీ మరియు ఎన్విరాన్మెంట్, ట్రేడర్లు మరియు ఇంపోర్టర్స్ బ్యాన్‌ని పరిగణనలోకి తీసుకోవాల్సిందిగా ఇప్పటికే హెచ్చరించాయి. ఎనర్జీ కన్జర్వేషన్‌లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అధికారికంగా రెండు నెలల క్రితమే వచ్చిన సర్కులర్‌తో అమ్మకాలు నిలిపివేసినట్లు ఓ హైపర్ మార్కెట్ ఉద్యోగి తెలిపారు. ముందస్తు ప్రచారంతో సిటిజన్స్‌లో కూడా అవగాహన పెరిగి, అధికారిక వర్గాల నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవడం అభినందనీయమని అధికారులు చెబుతున్నారు. ఇంకో వైపున, అధికారులు నిబంధనల్ని పాటించకుండా బ్యాన్ చేయబడ్డ బల్బ్స్ అమ్మకాలపై విరివిగా తనిఖీలు కూడా నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







