నవంబర్ 10న అనంతపురంలో జనసేన బహిరంగసభ
- October 24, 2016
జనసేన పార్టీ ఆధ్వర్యంలో నవంబర్ 11న అనంతపురం జిల్లాలో భారీ బహిరంగ జరగనుంది. పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ ఈ సభకు హాజరై ప్రసంగిస్తారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా సాధన కోసం ప్రతీ జిల్లాలో పోరాట సభను జనసేన నిర్వహిస్తుందని పవన్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాయలసీమలో వెనుకబడి ప్రాంతమైన అనంతపురంలో సభ జరపాలని పవన్‌కల్యాణ్ నిర్ణయించినట్లు జనసేన ఒక ప్రకటనలో తెలిపింది.
ఏపీకి ప్రత్యేకహోదా వస్తే కరవుతో సతమతమవుతున్న అనంతపురం జిల్లాకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని పవన్ అభిప్రాయపడ్డారు. ప్రత్యేకహోదా వల్ల వచ్చే నిధులతో జిల్లాను కరవు కోరల నుంచి కాపాడుకోవచ్చని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
అనంతపురంలో సభా వేదిక, సమయం తదితర వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.
తాజా వార్తలు
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్







