విడుదలకు సిద్ధంగా ఉన్న 'ఇద్దరూ ఇద్దరే'
- October 24, 2016
మోహన్‌లాల్, సత్యరాజ్ కథానాయకులుగా నటించిన మలయాళ చిత్రం 'లైలా ఓ లైలా'. అమలాపాల్ కథానాయిక. జోషి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని తెలుగులో 'ఇద్దరూ ఇద్దరే' అనే పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత కందల కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. 'ఇదో యాక్షన్ థ్రిల్లర్. ప్రతీ క్షణం ఉత్కంఠత కలిగిస్తుంది. అనువాద కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఇటీవల విడుదల చేసిన ప్రచార చిత్రానికి మంచి స్పందన వచ్చింది' అని అన్నారు. వచ్చే నెలలో 'ఇద్దరూ ఇద్దరే' చిత్రం ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







