'నందిని నర్సింగ్ హోం' సినిమాను కన్నడంలో రీమేక్..
- October 24, 2016
''మాది రాజమండ్రి. నేను జనార్ధన మహ ర్షి, ఇ.వి.వి. సత్యనారాయణల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాను. 'బెండు అప్పారావ్ ఆర్ఎంపి', 'దిక్కులు చూడకు రామయ్య' సినిమాలకు కథలు అందించాను. ఆ తర్వాత నిర్మాతలు రాధాకిషోర్.జి నాకు కజిన్ కాబట్టి వారికి ఓ కథ చెప్పాను. నచ్చి దర్శకుడిగా నన్నే చేయమన్నారు. అదే 'నందిని నర్సింగ్ హోమ్' చిత్రం'' అని దర్శకుడు పి.వి.గిరి అన్నారు. సోమవారం ఈయన విలేకరులతో మాట్లాడారు.
ఈ సినిమా ప్రధానంగా లవ్ కాన్సెప్ట్‌తో సాగుతుంది కాబట్టి నవీన్ విజరుకష్ణ అయితే బావుంటాడని భావించి సీనియర్ నరేష్, నవీన్‌ని కలిసి కథ వినిపించాం.
ఇద్దరూ కథ వినగానే హ్యపీగా ఫీలయ్యారు. సింగిల్ సిట్టింగ్‌లోనే కథను ఓకే చేశారు.
ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారనే దానిపై విడుదల ముందు వరకు చిన్నపాటి టెన్షన్ ఉండేది. ఆడియెన్స్ సినిమాను రిసీవ్ చేసుకున్న తీరు ఊహించలేనిది. మేం హైదరాబాద్‌లోని పలు థియేటర్స్‌లోకి వెళ్లి ఆడియెన్స్‌ను కలిశాం. అందరూ సినిమా బావుందని మెచ్చుకున్నారు. స్క్రీన్‌ప్లే బావుందని అన్నారు. సినిమాను పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులు సహా, హిట్లో భాగమైన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కష్ణ, విజయనిర్మల సినిమా బావుందని మెచ్చుకున్నారు. సినిమా మొదటి ఆట తర్వాత ఇక సీనియర్ నరేష్ కంట్లో అయితే నీళ్లు తిరిగాయి.
నవీన్ మంచి టెక్నిషియన్ అని సినిమా మొదలు పెట్టే వరకు నాకు తెలియదు. తను మంచి టెక్నిషియన్ అయినా దర్శకుడుగా నేను చెప్పింది చేసుకుంటూ వెళ్లిపోయాడు. మేకింగ్‌లో ఎక్కడా ఇన్వాల్వ్ కాలేదు. తన పాత్రలో మాత్రమే ఇన్వాల్వ్ అయ్యారంతే.
'నందిని నర్సింగ్ హోం' సినిమాను కన్నడంలో రీమేక్ చేయాలని అక్కడి నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ రీమేక్‌ను నేనే డైరెక్ట్ చేయాలా? లేదా? కేవలం రీమేక్ హక్కులను మాత్రమే ఇచ్చేయాలా అని చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం నా తదుపరి చిత్రానికి సంబంధించిన కథ సిద్ధమైంది. పివిపి బేనర్ నుంచి ఆఫర్ వచ్చింది. అయితే ఇదే బేనర్లో మరో సినిమాచేయలనే ఆలోచన ఉంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







