గోపీచంద్ సరికొత్త లుక్‌లో......
- October 24, 2016
గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై రూపొందుతోంది. నిర్మాతలు జె.భగవాన్, జె.పుల్లారావు మాట్లాడుతూ ''తొలి షెడ్యూల్‌ను అనుకున్న ప్రకారం పూర్తి చేశాం. బ్యాంకాక్ ఎయిర్‌పోర్టులో చిత్రీకరించిన ప్రీ క్లైమాక్స్, అక్కడి బార్లు, పబ్బుల్లో తీసిన దృశ్యాలు, బ్యాంకాక్ బ్రిడ్జ్‌పై హెలికాప్టర్‌తో తెరకెక్కించిన భారీ కార్ ఛేజింగ్ సన్నివేశాలు అద్భుతంగా వచ్చాయి. క్యాథరిన ఇంట్రడక్షన సీన, ఫ్యామిలీ, విలన్ సీన్లు కూడా రిచగా వచ్చాయి. గోపీచంద్ సరికొత్త లుక్‌లో కనిపిస్తారు. ఈ షెడ్యూల్‌లో దాదాపు 70 మంది నటీనటులు పాల్గొన్నారు.30 రోజుల పాటు చిత్రీకరించాం'' అని చెప్పారు. తనికెళ్ల భరణి, ముఖేష్ రుషి, సచిన్ కేడేఖర్, నికితన్ ధీర్, అజయ్, వెన్నెల కిశోర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి స్ర్కిప్ట్ కో ఆర్డినేటర్: సుధాకర్ పావులూరి, ఆర్ట్: బ్రహ్మ కడలి, యాక్షన్: రామ్-లక్ష్మణ్, ఎడిటర్: గౌతంరాజు, సంగీతం: ఎస్.ఎస్.థమన.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







