'భైరవ' తుదిదశ షూటింగ్‌కు భారీ భద్రత

- October 24, 2016 , by Maagulf
'భైరవ' తుదిదశ షూటింగ్‌కు భారీ భద్రత

ఇటీవల కొంతకాలంగా ప్రముఖ హీరోల సినిమా షూటింగ్‌లను సెల్‌ఫోన్‌లో వీడియో తీసి, ఇంటర్నెట్‌లో విడుదల చేయడం అలవాటుగా మారింది. ఆ మధ్య రజనీకాంత్‌ 'కబాలి' చిత్ర షూటింగ్‌ మలేషియాలో జరిగినప్పుడు అక్కడ చిత్రీకరణ చూస్తున్న అభిమానుల్లో ఒకరు వీడియో తీసి ఇంటర్నెట్‌లో విడుదల చేశారు. అదే విధంగా సిరుత్తై శివ దర్శకత్వంలో అజిత్‌ నటించిన 57వ చిత్ర షూటింగ్‌ ఐరోపాలో తీసిన దృశ్యాలు కూడా సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేశాయి. తర్వాత ఆయన షూటింగ్‌కు పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం విజయ్‌ నటిస్తున్న 'భైరవ' చిత్ర షూటింగ్‌ స్విట్జర్లాండ్‌లో జరుగుతోంది.

ఇక్కడ కీర్తిసురేష్‌తో విజయ్‌ నటిస్తున్న పాటల సన్నివేశాలను ఎవరో ఫొటో తీసి నెట్‌లో పెట్టారు. వీటిని చూసి దిగ్భ్రాంతి చెందిన 'భైరవ' యూనిట్‌ అప్రమత్తమైంది. ప్రస్తుతం అటువంటివి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంది. షూటింగ్‌ స్పాట్‌కు సంబంధం లేని వారిని ప్రవేశించనీయకుండా సెక్యూరిటీని పెంచారట.

తుదిదశ షూటింగ్‌కు భారీ భద్రత కల్పించనున్నట్లు చిత్ర యూనిట్‌ సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com