'అమెజాన్ యోధులు' దీపావళి కానుక...
- October 24, 2016
ప్రముఖ హాలీవుడ్ నటులు రిచాజెన్, సెసిలియా చియాంగ్ జంటగా ఇండో ఓవర్సీస్ బ్యానర్‌పై ఫ్రాంకీఛాన్ దర్శకత్వంలో 500 కోట్ల భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్ వాల్యూస్‌తో హాలీవుడ్లో జాకీచాన్ నిర్మించిన చిత్రం 'ది లెజండరీ అమెజాన్స్'. ఈ చిత్రం హాలీవుడ్లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసి భారీ వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రాన్ని సాయి శ్రీజ విఘ్నేష్ ఫిలిం ప్రొడక్షన్స్ పతాకంపై జి.వంశీకృష్ణ వర్మ 'అమెజాన్ యోధులు' పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. 'మాహిష్మతి రాజ్యం' ఉపశీర్షిక. దీపావళి కానుకగా అక్టోబర్ 29న ఈ చిత్రం రిలీజవుతోంది.
ఈ సందర్భంగా నిర్మాత జి.వంశీకృష్ణ వర్మ మాట్లాడుతూ - ''ప్రముఖ హాలీవుడ్ నటుడు జాకీచాన్ 500 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. హాలీవుడ్లో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచి సరికొత్త రికార్డ్‌లు నెలకొల్పింది. తెలుగు ప్రేక్షకులకు నచ్చేవిధంగా ఈ చిత్రం వుంటుంది. 'బాహుబలి' చిత్రం తరహాలో ఈ చిత్రంలోని యుద్ధ సన్నివేశాలు భారీగా వుంటాయి. యాక్షన్ సీన్స్ అన్నీ చాలా థ్రిల్లింగ్‌గా వుంటాయి. ఇంతకుముందెన్నడూ చూడని విధంగా సన్నివేశాలుంటాయి. డెఫినెట్‌గా ఈ సినిమా సక్సెస్ అయ్యి నిర్మాతగా నాకు మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాను. మా డిస్ట్రిబ్యూటర్స్ అందరూ ఎంతో కాన్ఫిడెంట్‌గా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. దీపావళి కానుకగా అక్టోబర్ 29న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం'' అన్నారు.
ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ నాగేశ్వరరావు మాట్లాడుతూ - ''బాహుబలి'లాంటి చిత్రమిది. ప్రేక్షకులకు నచ్చేవిధంగా యాక్షన్ సీన్స్, యుద్ధ సన్నివేశాలు చాలా ధ్రిల్లింగ్‌గా ఉంటాయి. ప్రతి విజువల్ చాలా గ్రాండియర్‌గా ఉంటుంది. దీపావళి పండగకి ఇంతటి భారీ బడ్జెట్ చిత్రాన్ని రిలీజ్ చేయడం మాకెంతో ఆనందంగా వుంది. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్మకం వుంది'' అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: జి. యుగంధర్‌రెడ్డి, నిర్మాత: జి.వంశీకృష్ణ వర్మ, దర్శకత్వం: ఫ్రాంకీ ఛాన్.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







