గల్ప్ లో చిత్రీకరణ జరుపుకుంటున్న `గల్ఫ్`
- October 24, 2016
సునీల్ కుమార్ రెడ్డి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం `గల్ప్`. యెక్కలి రవీంద్రబాబు, రమణీకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.చేతన్ మద్దినేని కథానాయకుడు. డింపుల్ కథానాయిక. ప్రస్తుతం గల్ప్‌లో చిత్రీకరణ జరుగుతోంది.
దర్శకుడు మాట్లాడుతూ ``గల్ఫ్ లో తెరకెక్కిస్తున్న తాజా షెడ్యూల్ ఈ నెలాఖరుతో పూర్తవుతుంది. గల్ఫ్, రసల్ ఖైమా, షార్జా, అజ్మాల్ తదితర ప్రాంతాల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం. హీరో చేతన్ మద్దినేని, హీరోయిన్ డింపుల్, సంతోష్ పవన్, అనిల్ కల్యాణ్, శివ, దిగ్విజయ్, తిరుపతి, అనురాధ, కిశోర్‌బాబు, శ్రీరామ్ తదితరులు షెడ్యూల్లో పాల్గొంటున్నారు. క్లైమాక్స్ తప్ప మిగిలిన షూటింగ్ అంతా పూర్తవుతుంది. నవంబర్‌లో రామోజీ ఫిల్మ్ సిటీలో క్లైమాక్స్ ను చిత్రీకరిస్తాం. అరబ్ నటులు జాసిమ్ హసన్ జుమా, అలీ, అహ్మద్ ఈ చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయమవుతున్నారు`` అని అన్నారు.
నిర్మాతలు మాట్లాడుతూ ``పిడికెడు మెతుకుల కోసం పొట్ట చేతబట్టుకుని గల్ఫ్ కి వెళ్తున్న వారి స్థితిగతులు ఎలా ఉన్నాయి? దూరపు కొండలు నునుపు అనే సామెతను మరిచిపోయి కన్నవారికి, కట్టుకున్నవాళ్లకి దూరంగా బతకాలనుకునే వారు గల్ఫ్‌లో జీవితాన్ని సుఖంగా గడుపుతున్నారా? భారంగా గడుపుతున్నారా? వంటి పలు అంశాలతో అల్లుకున్న కథే `గల్ఫ్`. ముళ్ల మధ్య గులాబీలు అందంగా వికసించినట్టు వ్యథలే కథగా మిగిలినా అందులోనూ ఓ స్వచ్ఛమైన ప్రేమ కథను చూపిస్తున్నాం. ఇందులో నాలుగు పాటలున్నాయి. `సరిహద్దు దాటిన ప్రేమకథ` అనే మా ఉపశీర్షికకు మంచి రెస్పాన్స్ వస్తోంది`` అని అన్నారు
పోసాని కృష్ణమురళి, నల్లవేణు, తోటపల్లి మధు, నాగినీడు, తీర్థ, దిగ్విజయ్, పూజిత, పింగ్ పాంగ్, పద్మశ్రీ, జీవా, సూర్య, శివ, ఎఫ్ ఎమ్ బాబాయ్, భద్రం, సోనమ్, ఎల్బీ శ్రీరామ్, బిత్తిలి సత్తి తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రవీణ్ ఇమ్మడి, డ్యాన్సులు: అజయ్, కెమెరా: ఎస్.వి.శివరామ్, పాటలు: సిరాశ్రీ, మాస్టర్జీ, కాసర్ల శ్యామ్, ఆర్ట్: నాగు, సహ నిర్మాతలు: డాక్టర్ ఎల్.ఎన్.రావ్, రాజాజీ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బాపిరాజు, మాటలు: పులగం చిన్నారాయణ, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సునీల్ కుమార్ రెడ్డి, నిర్మాతలు: యెక్కలి రవీంద్రబాబు, రమణీ కుమార్.
ఈ చిత్రానికి మాగల్ఫ్.కామ్ మీడియా పార్టనర్ గా వ్యవహరిస్తోంది.








తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







