అనుమానాస్పద వస్తువు: బహ్రెయిన్‌ హైవే మూసివేత

- October 24, 2016 , by Maagulf
అనుమానాస్పద వస్తువు: బహ్రెయిన్‌ హైవే మూసివేత


 
మనామా: సెక్యూరిటీ ఫోర్సెస్‌, ఆలిలో షేక్‌ జాయెద్‌ హైవేని మూసివేశారు. అనుమానాస్పద వస్తువుని కనుగొన్న భద్రతా సిబ్బంది ఈ మేరకు మూసివేత నిర్ణయం తీసుకున్నారు. రమ్లి మాల్‌ దగ్గర్లో పోట్టెర్రీ మాన్యుమెంట్‌ నుంచి అలా మరియు సల్మాబాద్‌ని కలిపే రౌండెబౌట్‌ వరకు రోడ్డుని మూసివేశారు. మూసివేత కారణంగా భారీ ట్రాఫిక్‌ ఝామ్‌ ఏర్పడింది. పోలీసులు అలాగే ట్రాఫిక్‌ విభాగానికి చెందిన పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరకున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియవలసి ఉంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com