జడ్జీలుగా రోబోలే పవర్ ఫుల్ పాత్ర ....
- October 25, 2016
కోర్టుల్లో ఇక న్యాయమూర్తుల బదులు రోబోలు కనిపిస్తే ఆశ్చర్యపోనక్కరలేదు. జడ్జీలుగా రోబోలే పవర్ ఫుల్ పాత్ర పోషిస్తాయని అంటున్నారు. పైగా ఇవి ఇచ్చే తీర్పులు కూడా 79 శాతం కరెక్టుగానే ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు. కంప్యూటర్ అనుసంధానిత ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సిస్టం తో కూడిన ఇవి జాగ్రత్తగా తీర్పులు ఇవ్వవచ్చునని, కేసుల సత్వర పరిష్కారానికి దోహదపడవచ్చునని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ రీసెర్చర్లు అంటున్నారు.
ఈ రోబోలు ఒక కేసును ఎలా సాల్వ్ చేయాలో ఆలోచిస్తాయని వాళ్ళు పేర్కొన్నారు. టార్చర్ వంటి 584 కేసుల విషయంలో యూరప్ లోని సీనియర్ న్యాయమూర్తులు పాటించిన పద్ధతిని, సమాచారాన్ని కంప్యూటర్లు అధ్యయనం చేసి ఈ రోబోలకు అప్పగిస్తాయని, దాంతో ఇవి తీర్పులు ఇవ్వగలుగుతాయని వారు తమ నివేదికలో తెలిపారు.
అయితే ఇందుకు ఇంకా చాలా కాలం పట్టవచ్చునని అభిప్రాయపడ్డారు. అతి ముఖ్యమైన కేసుల పరిష్కారంలో జడ్జీలు ఇలాంటి రోబోలను వినియోగించుకోవచ్చునని అంటున్నారు. ఇవి సాక్ష్యాధారాలను స్టడీ చేస్తాయని, సరైన రూలింగ్ ఇవ్వగలుగుతాయని కూడా పరిశోధకులు పేర్కొన్నారు.యూరోపియన్ కోర్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ పబ్లిక్ డేటా బేస్ లో నిక్షిప్తమైన ఈ 584 కేసుల సమాచారాన్ని కృత్రిమ మెదడు కలిగిన కంప్యూటర్ కు ఫీడ్ చేశాం.. అనంతరం తీర్పు చెప్పాలని కంప్యూటర్ ని కోరాం. కేసులను సమగ్రంగా విశ్లేషించిన ఈ కంప్యూటర్ 79 శాతం కచ్చితత్వం తో రూలింగ్ ఇచ్చింది అని డాక్టర్ నికోలస్ ఆలెట్రాస్ అనే పరిశోధకుడు వివరించాడు. ఈ రంగంలో ఇలాంటి ప్రయోగం నిర్వహించడం ఇదే మొదటిసారని, జడ్జీలు, లాయర్ల అవసరాన్ని తగ్గించడం కోసం తామీ పరిశోధన జరపలేదని ఆయన స్పష్టం చేశాడు. వారికి సాయంగా ఆధునిక టెక్నాలజీ ఎంతవరకు ఉపయోగపడగలదనే ఉద్దేశంతోనే ఈ రీసెర్చ్ చేశామని తెలిపాడు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







