ఉప్పల్ క్రికెట్ స్టేడియం పైకప్పు కాంట్రాక్ట్ లో దాదాపు 4 కోట్లు ఫ్రాడ్..
- October 25, 2016
ఉప్పల్ క్రికెట్ స్టేడియం పైకప్పునకు సంబంధించి కాంట్రాక్ట్ అప్పగింతలో దాదాపు 4 కోట్లు ఫ్రాడ్ జరిగినట్టు ఏసీబీ నిర్ధారించింది. ఇందులోభాగంగా ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్ క్రికెట్ అసిసోయేషన్ అధ్యక్షుడు అర్షద్ అయూబ్‌తోపాటు మాజీ ఉపాధ్యక్షులు వినోద్, ఎం.వి. శ్రీధర్, కార్యదర్శి చలపతి, కార్యదర్శి కె జాన్ మనోజ్, మాజీ సంయుక్త కార్యదర్శి శేషాద్రి వెంకటేశ్వరన్, కోశాధికారి దేవరాజ్, మాజీ కోశాధికారి నరేశ్‌శర్మ, ఢిల్లీకి చెందిన కాంట్రాక్ట్ ప్రతినిధులు ఏసీబీ న్యాయస్థానం ఎదుట హాజరయ్యారు.
స్టేడియం పైకప్పు నిర్మాణానికి సంబంధించిన వ్యవహారంపై తక్కువ మొత్తాలకు వేసిన టెండర్లను కాదని, 23 కోట్లకు ఢిల్లీకి చెందిన ఓ కాంట్రాక్ట్ వేసిన టెండర్‌ను హెచ్‌సీఏ ఆమోదించింది.
దీనిపై షాలిమార్ క్రికెట్ ఎలెవన్ సంఘం ప్రతినిధి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసింది ఏసీబీ. దీనిపై దర్యాప్తు చేసి ఛార్జ్‌షీట్‌ని సమర్పించింది ఏసీబీ. దీన్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం నిందితులకు సమన్లు జారీ చేయడంతో సోమవారం కోర్టుకు హాజరయ్యారు. తదుపరి విచారణను న్యాయస్థానం వచ్చేనెల 28కి వాయిదా వేసింది.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!







