తనీష్ కృష్ణవంశీ విలన్!
- October 25, 2016
సృజనాత్మక డైరెక్టర్లలో మొట్టమొదటి స్థానంలో నిలిచేది కృష్ణవంశీ. అందుకే అతడికి క్రియేటివ్ డైరెక్టర్ అన్న ట్యాగ్ పడింది. ప్రస్తుతం ఆ క్రియేటివ్ డైరెక్టర్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా నక్షత్రం. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు, ఫస్ట్‌లుక్‌లు విడుదల చేయడంలోనూ కృష్ణవంశీ తన మార్క్ క్రియేటివిటీని ఉపయోగిస్తున్నాడనడంలో సందేహం లేదు. తాజాగా తన విలన్ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశాడు కృష్ణవంశీ. ఆ విలన్ ఎవరో తెలిస్తే కొంత ఆశ్చర్యం కలగక మానదు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా వెండితెరకు పరిచయమై.. ఆ తర్వాత హీరోగా తన లక్కును పరీక్షించుకొని విఫలమయ్యాడు అతడు. తనీష్. నచ్చావులే, రైడ్ వంటి చిత్రాలతో హీరోగా ప్రేక్షకుల ముందుకొచ్చిన తనీష్..
తాజాగా సినిమాలో విలన్ అవతారం ఎత్తాడు. కళ్లకు లెన్సులు పెట్టుకుని నిజంగా విలనిజాన్ని ఫస్ట్‌లుక్‌లోనే పండించేశాడు తనీష్. మరి హీరోగా ప్రూవ్ చేసుకోలేకపోయిన తనీష్.. విలన్‌గానైనా ఆకట్టుకుంటాడా?
పోస్టర్లో ఉన్నంత దీటుధనాన్ని సినిమాలో చూపిస్తాడా? అన్నది సినిమా వచ్చే వరకు ఆగాల్సిందే. సందీప్ కిషన్, రెజీనా హీరో..హీరోయిన్లుగా చేస్తున్న ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్, ప్రగ్యా జైస్వాల్‌లు ప్రత్యేక అతిథి పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







