తెలుగు చిత్ర పరిశ్రమకే కాదు అఖిలంద్ర ప్రజానికానికి ఆగస్టు 22వ తేదీ గురించి ప్రత్యేకంగా చేయనక్కర్లేదు. ఎందుకంటే టాలీవుడ్ సుప్రీం హీరో & మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు ఆ రోజు. 60వ ఏటా అడుగుపెట్టిన మన చిరుకి ముందుగా తెలుగు మిర్చి తరుపున విషెస్ తెలుపుతున్నాం. రాజకీయ ప్రవేశం తర్వాత ఇండస్ట్రీకి కొంత దూరమైన చిరంజీవి మళ్లీ పూర్తిగా ఇండస్ట్రీతో కలిసి ప్రయాణించడానికి సిద్ధమయ్యాడు. దాంతో చిరు 60వ బర్త్‌డే వేడుకను చాల గ్రాండ్ గా జరిపారు. చిరు అభిమానులు రక్త దాన శిబిరాలు, సేవా కార్యక్రమాలతో పాటు పలు ఇతర కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలో మెగా హీరోలందరూ పాల్గొని చిరు పుట్టిన రోజును ఎంజాయ్ చేసారు. ఆగస్టు 22న పార్క్ హయత్ హోటల్లో సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖుల కోసం పెద్ద ఎత్తున బర్త్‌డే పార్టీని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయనున్నారు. ఈ పార్టీకి సూపర్ స్టార్లు బిగ్ బి, రజనీకాంత్, ఆమీర్ ఖాన్, సల్మాన్‌ఖాన్, పాటు పలువురు సినీ స్టార్లు కూడా హాజరుకానున్నట్టు తెలిసింది. చిరు బర్త్‌డే కానుకగా అతిథుల కోసం ఓ స్టన్నింగ్ గిఫ్ట్‌ను రామ్‌చరణ్ ప్లాన్ చేసినట్టు సమాచారం. ఎంతో కాలంగా చిరు 150 వ చిత్రం ఫై ఓ క్లారిటి వస్తుందని అబిమానులు అనుకున్న వారికి నిరాశే మిగిలింది..అయిన కానీ మరో నెలలో ఈ చిత్రం ఫై ఓ అధికారిక ప్రకటన రాబోతుందని తెలుస్తుంది. ఏది ఏమయినా చిరు మళ్లీ సినిమాల్లోకి రావడం తో అబిమనులే కాదు , ఇండస్ట్రీ లోని హీరోలు కూడా సంతోషిస్తున్నారు. ఇంకో మెగా అబిమానులకు గుడ్ న్యూస్ ఏంటి అంటే..చిరు పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ - శ్రీను వైట్ల మూవీ ఫస్ట్ లుక్ టిసర్ రిలీజ్ చేసారు..ఆ వీడియో మీకోసం.
మెగాస్టార్ కి 60వ పుట్టిన రోజు శుభాకాంక్షలు ..
- August 21, 2015
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







