కోయలిషన్‌ ఆఫ్‌ ఓవర్సీస్‌ తెలంగాణ అసోసియేషన్ (కోటా) ఆవిర్భావం

- October 25, 2016 , by Maagulf

విదేశాలలోని తెలంగాణ వారిని సమన్వయ పరుస్తూ ఐక్యతా భావం పెంపొందించడానికి ఐక్య రాజ్యసమితిలోని భాగం (యునైటెడ్‌ నేషన్స్‌) స్ఫూర్తితో కొనసాగించగలమని వ్యవస్థాపకులు, ప్రవాసి మాసపత్రిక ఎడిటర్‌, ప్రవాస కార్మిక నాయకులు మంద భీంరెడ్డి తెలిపారు. సోమవారం సోమా జిగూడ ప్రెస్‌ క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ... దేశాల మధ్య స్నేహసంబంధాలను పెంపొం దిచడానికి ఐక్య రాజ్యసమితి యునైటెడ్‌ నేషన్స్‌ ఎంత కృషి చేస్తోందో దానిని స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణ ప్రవాసి సంఘాల ఐక్యవేదిక (కోటా) ఏర్పాటు చేయబడిందని తెలిపారు. మానవ హక్కులపై సమష్టి కృషి చేయడానికి అంతర్జాతీయ సంస్థ ఐక్యరాజ్య సమితి ఆవిర్భావం దినోత్సవాన్ని అక్టోబర్‌ 24న జరుపుకోవడం పాటిస్తారు. కోయలిషన్‌ ఆఫ్‌ ఓవర్సీస్‌ తెలంగాణ అసోసియేషన్స్‌ను అక్టోబర్‌ నుంచి ప్రారంభిస్తున్నామని తెలిపారు. భారతీ య సాంస్కృతి సాంప్రదాయాలను, భాష పరిర క్షణ చేయడానికి ఈ వేదిక కృషిచేయనుందన్నారు​. విదేశాలలో స్థిరపడిన ఎన్నారైల సంఘాలను సమన్వయ పరుస్తూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలతో సంప్రదింపులు జరుపుకుంటూ మాతృభూమి అభివృద్ధికి కృషి చేస్తోందని అన్నారు.ప్రవాసుల అభ్యున్నతి కోసం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనుసం దానంతో విదేశీ రాయబారుల అనుసందానం తో కార్యకలాపాలు కొనసాగిస్తామని వెల్లడిం చారు. కార్యక్రమంలో టీడీఎప్‌, టిపి.రెడ్డి, పారి జాత(కెనడా), డాక్టర్‌. రంగయ్య (ఓమాస్‌) స్వరూపారెడ్డి, సరిత, సినీదర్శ కుడు సునిల్‌ కుమార్‌రెడ్డి, దైవజ్ఞశర్మ హాజరయ్యారు. అనం తరం గోడపత్రికను ఆవిష్కరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com