ఈ ఉపాయాలతో మీ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోండి.
- October 25, 2016
కళ్ళు సరిగా ఉంటేనే మనం సౌకర్యంగా ఉంటాము అవునా! కళ్ళు అనారోగ్యంగా ఉంటే అంతర్గతంగా కూడా ఏదో లోటు ఉన్నట్టు అనిపిస్తుంది. కావున ఈ ఉపాయాలతో మీ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోండి.
కంటి నవ్వును ఆపకండి
చూసిన దానికి అనుగుణంగానే మన ప్రతిచర్య ఉంటుంది. స్కూల్, పనిలో మరియు ఇతర సాంఘీక కార్యకలాపాలలో మంచి మంచి దృష్టి కీలక పాత్ర పోషిస్తుంది. దృష్టి లోపాలు మన మానసిక ఆరోగ్యంపై ప్రభావంతో పాటూ మరియు సాంఘీక కార్యకలాపాలలో క్రియారహితంగా చేస్తుంది. మార్కెట్లో లభించే కాంటాక్ట్ లెన్స్ మరియు అద్దాలు కంటి చూపును మెరుగుపరుస్తాయి. కానీ ఇక్కడ తెలిపిన పద్దతులు సహజంగా మన కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
కంటి చూపు ఎలా పని చేస్తుందో తెలుసుకోండి
కంటి చూపు ఎలా పని చేస్తుందో ముందు తెలుసుకోండి. ఇలా తెలుసుకోవటం వలన ఏ అలవాట్లు కంటి చూపు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయో మరియు ఏ అలవాట్లు హని కలిగిస్తాయో తెలుస్తుంది.
కంటిని పొడిబారనివ్వకండి
కళ్ళు ఆరోగ్యంగా ఉండటానికి మీరు తేమ నిరంతరంగా అందించాలి. కళ్ళలో దురదలుగా, ఎరుపుగా, నొప్పిగా ఉంటే మీ కళ్ళు పొడిగా మారతాయి. కావున ఎక్కువ సమయం TV ముందు కానీ, కంప్యూటర్ ముందు కానీ కుర్చోకండి. మరియు నిరంతరం కనురెప్పలను వాల్చుతూ ఉండండి.
వ్యాయామాలు
మీ కళ్ళు ఆరోగ్యంగా ఉండలంటే, మీరు వాటికి నిరంతరం వ్యాయామాలు చేస్తూ ఉండాలి. ప్రతి 20 నిమిషాలకు ఒకసారి 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును కనీసం 20 సెకన్ల పాటూ చూడండి.
విరామాలను తీసుకోండి
కూర్చొని ఉండే ఉద్యోగంలో చాలా సమయం పాటూ అలానే ఉంటున్నారా? అయితే క్రమంగా విరామాలు తీసుకోవటం మంచిది. ఇలా విరామలాను తీసుకోవటం వలన కంటిపై పడే ఒత్తిడి తొలగిపోయి వాటంతట అవే నయం అవుతాయి.
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







