కోయలిషన్ ఆఫ్ ఓవర్సీస్ తెలంగాణ అసోసియేషన్ (కోటా) ఆవిర్భావం
- October 25, 2016
విదేశాలలోని తెలంగాణ వారిని సమన్వయ పరుస్తూ ఐక్యతా భావం పెంపొందించడానికి ఐక్య రాజ్యసమితిలోని భాగం (యునైటెడ్ నేషన్స్) స్ఫూర్తితో కొనసాగించగలమని వ్యవస్థాపకులు, ప్రవాసి మాసపత్రిక ఎడిటర్, ప్రవాస కార్మిక నాయకులు మంద భీంరెడ్డి తెలిపారు. సోమవారం సోమా జిగూడ ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడుతూ... దేశాల మధ్య స్నేహసంబంధాలను పెంపొం దిచడానికి ఐక్య రాజ్యసమితి యునైటెడ్ నేషన్స్ ఎంత కృషి చేస్తోందో దానిని స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణ ప్రవాసి సంఘాల ఐక్యవేదిక (కోటా) ఏర్పాటు చేయబడిందని తెలిపారు. మానవ హక్కులపై సమష్టి కృషి చేయడానికి అంతర్జాతీయ సంస్థ ఐక్యరాజ్య సమితి ఆవిర్భావం దినోత్సవాన్ని అక్టోబర్ 24న జరుపుకోవడం పాటిస్తారు. కోయలిషన్ ఆఫ్ ఓవర్సీస్ తెలంగాణ అసోసియేషన్స్ను అక్టోబర్ నుంచి ప్రారంభిస్తున్నామని తెలిపారు. భారతీ య సాంస్కృతి సాంప్రదాయాలను, భాష పరిర క్షణ చేయడానికి ఈ వేదిక కృషిచేయనుందన్నారు. విదేశాలలో స్థిరపడిన ఎన్నారైల సంఘాలను సమన్వయ పరుస్తూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలతో సంప్రదింపులు జరుపుకుంటూ మాతృభూమి అభివృద్ధికి కృషి చేస్తోందని అన్నారు.ప్రవాసుల అభ్యున్నతి కోసం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనుసం దానంతో విదేశీ రాయబారుల అనుసందానం తో కార్యకలాపాలు కొనసాగిస్తామని వెల్లడిం చారు. కార్యక్రమంలో టీడీఎప్, టిపి.రెడ్డి, పారి జాత(కెనడా), డాక్టర్. రంగయ్య (ఓమాస్) స్వరూపారెడ్డి, సరిత, సినీదర్శ కుడు సునిల్ కుమార్రెడ్డి, దైవజ్ఞశర్మ హాజరయ్యారు. అనం తరం గోడపత్రికను ఆవిష్కరించారు.

తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







