సర్కార్ సీక్వల్ చేసే హక్కు రాంగోపాల్ వర్మకు లేదంటూ నోటీసులు...
- October 26, 2016
ఇండియన్ సినిమా రూపు రేఖలు మార్చిన గ్రేట్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఎప్పుడు వివాదాలతోనే సావాసం చేస్తుంటాడు. తన సినిమాలకు తను సృష్టించే వివాదాలతోనే పబ్లిసిటీ చేసుకునే వర్మ తాజా మరో వివాదానికి కారణమయ్యాడు. ప్రస్తుతం వర్మ.., అమితాబ్ బచ్చన్ లీడ్ రోల్ లో సర్కార్ 3 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే సర్కార్, సర్కార్ రాజ్ సినిమాలతో ఘనవిజయాలు సాధించిన ఆర్జీవీ ఈ మూడో భాగంతో మరోసారి అదే మ్యాజిక్ ను రిపీట్ చేయాలని భావిస్తున్నాడు. అయితే వర్మకు సర్కార్ సీక్వల్ చేసే హక్కు లేదంటూ ఓ వ్యక్తి నోటీసులు పంపించాడు. ముంబైకి చెందిన నరేంద్ర హిరావత్, సర్కార్ సీరీస్ కు సంబందించిన సకల హక్కులు తనవని, ఆ సినిమాకు సీక్వల్, రీమేక్ లాంటివి చేయాలంటే తన అనుమతి అవసరమని తెలిపాడు.
రాంగోపాల్ వర్మ తనను సంప్రదించకుండానే సర్కార్ 3 షూటింగ్ మొదలుపెట్టాడని. వెంటనే వర్మ తనతో మాట్లకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని నోటీసులలో తెలిపాడు. వర్మ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సర్కార్ హక్కులు మరొకరి దగ్గర ఎందుకు ఉన్నాయో..? ఈ వివాదం పై వర్మ ఎలా స్పందిస్తాడో..? తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







