మైనింగ్ స్కాం నుంచి విముక్తి : యడ్యూరప్ప
- October 26, 2016
మైనింగ్ స్కాం నుంచి తనకు విముక్తి లభించడంతో కర్నాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప హర్షం వ్యక్తం చేశారు. ఏ తప్పూ చేయలేదని న్యాయస్థానం నిర్ధారించిందని అన్నారు. బుధవారం సీబీఐ కోర్టు తీర్పు వచ్చిన వెంటనే స్పందించిన ఆయన మాట్లాడుతూ ఇంతకాలం తన వెంట ఉన్న కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. నిజం నిలకడమీద తెలిసిందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కోర్టు తీర్పు తనకు ఊరట ఇచ్చిందని అన్నారు. తనపై వచ్చిన తప్పుడు ఆరోపణలు వీగిపోయాయని అన్నారు. తనకు న్యాయస్థానంపై పూర్తి నమ్మకం ఉందని, తమ కార్యకర్తలకు కొత్త ప్రేరణ లభిస్తుందని, మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు తమ కార్యకర్తలు ప్రయత్నిస్తారని యడ్యూరప్ప అన్నారు.యడ్యూరప్పను కోర్టు నిర్దోషిగా ప్రకటించడంతో కర్నాటకలో రాజకీయాలు మారతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







