భారత్ తన తదుపరి మ్యాచ్‌లో జర్మనీతో తలపడనుంది.
- October 26, 2016
5వ నేషనల్ ఇన్విటేషనల్ హాకీ టోర్నమెంట్లో భారత జూనియర్ మహిళల జట్టు తన ఖాతాలో మరో విజయం నమోదు చేసుకుంది. స్పెయిన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 3-2తేడాతో విజయాన్ని దక్కించుకుంది.ఆట ప్రారంభమైన 15వ నిమిషంలో స్పెయిన్ క్రీడాకారిణి క్లారా మొదటి గోల్ చేసి తన జట్టును ఆధిక్యంలోకి తీసుకెళ్లింది. 28వ నిమిషంలో భారత క్రీడాకారిణి జ్యోతి గోల్ చేయడంతో ఇరు జట్ల స్కోరు సమమైంది. 42వ నిమిషంలో పెనాల్టి కార్నర్ ద్వారా రీతూ గోల్ చేసి భారత్‌ను ఆధిక్యంలోకి తీసుకెళ్లింది. రెండు నిమిషాల వ్యవధిలోనే స్పెయిన్ క్రీడాకారిణి గోల్ చేయడంతో మరోసారి జట్టు స్కోరు సమమైంది.ఈ సమయంలో ఇరుజట్ల మధ్య పోరు హోరాహోరీగా సాగింది. చివరి 10నిమిషాల సమయంలో గోల్ చేసేందుకు భారత్ శాయశక్తులా కృషి చేసింది. ఈ క్రమంలో సంగీత కుమారి గోల్ చేయడంతో 3-2 ఆధిక్యంలోకి దూసుకెళ్లి స్పెయిన్‌పై విజయాన్ని నమోదు చేసింది.
భారత్ తన తదుపరి మ్యాచ్‌లో జర్మనీతో తలపడనుంది. ఈ మ్యాచ్ ఈ నెల 27న జరగనుంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







