'ఆత్మాహుతి డ్రోన్'ను ఇరాన్ అభివృద్ధి చేసింది...
- October 26, 2016
: భారీ స్థాయిలో పేలుడు పదార్థాలను మోసుకెళ్లి ఢీ కొట్టడం ద్వారా లక్ష్యాలను నాశనం చేసే సరికొత్త 'ఆత్మాహుతి డ్రోన్'ను ఇరాన్ అభివృద్ధి చేసింది. ప్రాథమికంగా సముద్ర సంబంధిత నిఘా కోసం ఆ దేశ సైనిక విభాగం 'రెవల్యూషనరీ గార్డ్స్' దీన్ని రూపొందించినట్లు ఓ వార్తాసంస్థ వెల్లడించింది. అయితే, సముద్రంతోపాటు భూమిపైగల లక్ష్యాలనూ ఆత్మాహుతి దాడులతో ఛేదించే సామర్థ్యం దీనికి ఉందని పేర్కొంది. భారీస్థాయిలో పేలుడు పదార్థాలను ఇవి మోసుకెళ్లగలవని.. క్షిపణులను మాత్రం వీటి ద్వారా ప్రయోగించలేరని వివరించింది. నీటి ఉపరితలంపై కేవలం అర మీటరు ఎత్తులో గంటకు 250 కిలోమీటర్ల వేగంతో ఇవి ప్రయాణించగలవని పేర్కొంది.
అవసరాన్ని బట్టి 900 మీటర్ల ఎత్తు వరకూ ఎగురుతాయని సూచించింది. అమెరికాకు చెందిన ఆర్‌క్యూ-170 సెంటినల్ డ్రోన్ నిర్మాణం ఆధారంగా 'సీఘెహ్' అనే సరికొత్త డ్రోన్‌ను తాము రూపొందించినట్లు ఇరాన్ ఈ నెలారంభంలో ప్రకటించింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







