జీవన భృతి నెలకు రూ.2.5లక్షలు భర్త నుంచి కోరిన సినీనటి రంభ...
- October 27, 2016
భర్తతో తన దాంపత్య హక్కులను పునరుద్ధరించాలంటూ మంగళవారం ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించిన సినీనటి రంభ బుధవారం దీనికి అనుబంధంగా మరో పిటిషన్ వేసింది. హిందూ వివాహ చట్టం ప్రకారం తనకు భర్త నుంచి నెలకు రూ.2.5 లక్షలు జీవన భృతిగా ఇప్పించాలని ఆ పిటిషన్‌లో ఆమె కోరారు. తనకు నెలకు రూ.1.5 లక్షలు, తన ఇద్దరు మైనర్ కుమార్తెల బాగోగుల కోసం చెరో రూ.50 వేల చొప్పున మొత్తం రూ.2.5 లక్షలు ఇప్పించాలని ఆమె కోరారు. పెళ్లికి ముందు నటిగా తనకు ఆదాయం ఉండేదని, పెళ్లి తర్వాత తనకు ఆదాయమార్గం లేకుండా పోయిందని ఆమె తన పిటిషన్‌లో తెలిపారు. పెళ్లి తర్వాత సినిమాల్లో నటించడం దాదాపు మానేశానని, తనతో పాటు తన పిల్లల పోషణకు తగిన ఆదాయం లేదని ఆమె పేర్కొన్నారు.రంభ పెద్ద కుమార్తె లాన్య ఒక ప్రైవేటు స్కూలులో చదువుతోంది. పాపకు స్కూలు ఫీజుగా ఏడాదికి రూ.3.5 లక్షలు కట్టాల్సి ఉంటుంది. చిన్న కుమార్తె సషాకు ఏడాదిన్నర వయసు కావండంతో వైద్య ఖర్చులు అనివార్యమవుతాయి. ఆ కారణంగా తనకు, తన పిల్లలకు జీవనభృతి కల్పించాలని రంభ కోరారు.కెనడాలో ఒక ఫ్యాక్టరీకి యజమాని అయిన తన భర్త పి.ఇంద్రకుమార్ ఏడాదికి రూ.25 లక్షలు సంపాదిస్తారని, కుటుంబ పోషణ ఆయన విద్యుక్త ధర్మమని రంభ తన పిటిషన్‌లో కోర్టుకు విన్నవించారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







