'రాజుగారిగది2 సినిమాలో నాగార్జున
- October 27, 2016
బుల్లితెరపై ఆట, ఆట జూనియర్స్ డాన్స్ షో తో పాపులర్ టీవీ యాంకర్‌గా ప్రచారంలోకి వచ్చిన ఓంకార్ తరువాత దర్శకుడిగా పరిచయం అయ్యి 'రాజుగారిగది సినిమాతో తన మల్టీటాలెంట్‌ను నిరూపించుకున్నాడు. ఈ హర్రర్ సినిమా ప్రేక్షకాదరణ పొందటంతో పాటు మంచి వసూళ్లను సాధించి హిట్ చిత్రాల లిస్ట్‌లో నిలిచింది. ఇదిలాఉంటే ప్రస్తుతం ఈ చిత్రానికి కొనసాగింపుగా 'రాజుగారిగది 2 తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఓ కీలకమైన రోల్‌లో అక్కినేని నాగార్జున నటిస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ పాత్రకు మొదట్లో వెంకటేష్ నటిస్తారని అనుకన్నప్పటికీ 'నాగ్ నే ఫైనల్ చేశారు చిత్ర యూనిట్. నాగార్జున 'సోగ్గాడే చిన్నినాయన సినిమాలో ఆత్మరూపంలో వచ్చి అభిమానులను ఆకట్టుకున్నాడు.
'రాజుగారిగది2 సినిమాలో నాగార్జున పాత్ర ఎలా ఉండబోతుందని ప్రేక్షకులు ఆసక్తితో ఉన్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ 'మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్ ఈ సినిమాను నిర్మిస్తుంది
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







