12 మంది బబ్బర్ ఖల్సా ఉగ్రవాదుల చొరబాటు
- October 27, 2016
దేశంలో పెద్దయెత్తున ఉగ్రదాడులు జరిపేందుకు బబ్బర్ ఖల్సా గ్రూపుకు చెందిన ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు జారీచేశాయి. దాదాపు 12 మంది ఉగ్రవాదులు పంజాబ్‌లోకి అక్రమంగా ప్రవేశించారని, వీరు ఉత్తర భారతదేశంలో దాడులు చేసేందుకు యత్నించే అవకాశం ఉందని ముందస్తు హెచ్చరికలు జారీచేశాయి. దీంతో పంజాబ్‌లో హైఅలర్ట్‌ను ప్రకటించారు. ఈనెల 23న పంజాబ్‌లో అనుమానిత ఉగ్రవాది కమల్‌దీప్ సింగ్‌ని విచారించగా ఈ విషయాన్ని వెల్లడించినట్లు ఐబీ అధికారులు తెలిపారు.
ఉగ్ర కార్యకలాపాలు నిర్వహించేందుకు 12 మంది పాకిస్థాన్‌లో శిక్షణ పొందిన ఉగ్రవాదులు భారత్‌లోకి ప్రవేశించినట్లు అధికారులు తెలిపారు.
ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో పంజాబ్ రాష్ట్ర డీజీపీ... సీనియర్ పోలీసు అధికారులతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. సరిహద్దు ప్రాంతాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ముమ్మరంగా తనిఖీలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







