భారత దేశ రాజధాని లో ఇద్దరు ఐ.ఎస్.ఐ. ఏజెంట్ల అరెస్ట్

- October 27, 2016 , by Maagulf
భారత దేశ రాజధాని లో ఇద్దరు ఐ.ఎస్.ఐ. ఏజెంట్ల అరెస్ట్

పాకిస్తాన్ భారత వ్యతిరేక చర్యలు శ్రుతిమించుతున్నాయి. ఉగ్రవాదులను ప్రేరేపించడం, సరిహద్దుల్లో కాల్పులకు పాల్పడటంతో పాటు ఏకంగా ఢిల్లీలో గూఢచర్యం కూడా జరుగుతోంది. పాక్ రాయబార కార్యాలయ ఉద్యోగి అరెస్టుతో ఈ విషయం బయటపడింది. గూఢచర్యానికి పాల్పడుతున్నాడనే అనుమానంతో అక్తర్ ను  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద రక్షణ శాఖకు చెందిన రహస్య పత్రాలు లభించాయి. BSD బలగాల కదలికలకు సంబంధించిన సమాచారం ఆ పత్రాల్లో ఉండటంతో అతడిని పోలీసులు ప్రశ్నించారు. అయితే దౌత్య సిబ్బంది కావడంతో  ప్రశ్నించి వదిలిపెట్టారు. అతడిని భారత్ విడిచి పెళ్లాలని ఆదేశించారు. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న భారత విదేశాంగ శాఖ, పాక్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ ను సమన్లు జారీచేసింది. ఆయన్ని పిలిపించుకుని ప్రశ్నించింది. పాక్ దౌత్య కార్యాలయం పనితీరుపై బాసిత్ పై ప్రశ్నల వర్షం కురిపించినట్టు     తెలుస్తోంది. మరోవైపు, పాకిస్తాన్ ISI గూఢచారులుగా పనిచేస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వారిద్దరూ రాజస్థాన్ కు చెందిన వారు. వారిని ఢిల్లీ క్రైం బ్రాంచ్ హెడ్ క్వార్టర్స్ లో పోలీసులు విచారిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com