దీపావళి సందర్భంగా 'సింగం 3' మోషన్ పోస్టర్‌ని విడుదల

- October 27, 2016 , by Maagulf
దీపావళి సందర్భంగా  'సింగం 3' మోషన్ పోస్టర్‌ని విడుదల

    సూర్య- అనుష్క-శృతిహాసన్ కాంబినేషన్‌లో రానుంది 'సింగం 3'. రెండుపార్ట్‌లు బాక్సాఫీసు వద్ద హిట్ కొట్టడంతో మూడోదానిపై అంచనాలు రెట్టింపయ్యాయి. దీపావళికి రావాల్సిన ఈ మూవీ, కార్తీ 'కాష్మోరా' వుండడంతో డిసెంబర్‌కి వెళ్లింది. షూటింగ్ దాదాపు పూర్తికావడంతో పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
దీపావళి సందర్భంగా మోషన్ పోస్టర్‌ని విడుదల చేసింది యూనిట్. సూర్యని పోలీసు అధికారిగా చూపించాడు డైరెక్టర్ హరి. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. తెలుగు, తమిళంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 16న రిలీజ్ చేయనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com