నవంబర్‌ 3న యూఏఈ ఫ్లాగ్‌ డే

- October 28, 2016 , by Maagulf
నవంబర్‌ 3న యూఏఈ ఫ్లాగ్‌ డే

యూఏఈ వైస్‌ ప్రెసిడెంట్‌, ప్రైమ్‌ మినిస్టర్‌ ఆఫ్‌, దుబాయ్‌ రూలర్‌ షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తౌమ్‌, నవంబర్‌ 3వ తేదీన యూఏఈ ఫ్లాగ్‌ డే సెలబ్రేషన్స్‌ అంగరంగ వైభవంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. అదే రోజు ప్రెసిడెంట్‌ షేక్‌ ఖలీఫా బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌ లీడర్‌ ఆఫ్‌ ది కంట్రీగా బాధ్యతలు స్వీకరించిన సందర్భం కూడా కలిసి వచ్చినట్లు తెలిపారు షేక్‌ మొహమ్మద్‌. ప్రభుత్వ శాఖలు, అలాగే దేశ ప్రజలు యూఏఈ ఫ్లాగ్‌కి గౌరవ వందనం ఇవ్వాల్సిందిగా కోరారు. మనందరి ఐక్యతను ఈ వేడుక ద్వారా ప్రపంచానికి చాటి చెప్పాలని పిలుపునిచ్చారు షేక్‌ మొహమ్మద్‌. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com