అబుదాబీ, ఇండియా మధ్య సర్వీసులను విస్తరించిన ఎతిహాద్
- October 28, 2016
ఎతిహాద్ ఎయిర్‌వేస్, అబుదాబీ మరియు ఇండియా మధ్య సర్వీసులను ఇంకా విస్తరించేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించింది. వ్యూహాత్మక భాగస్వామి అయిన జెట్ ఎయిర్‌వేస్‌తో కొత్త రూట్స్‌ని ప్రారంభిస్తున్నారు. 2017 నుంచి ఎతిహాద్ మరియు జెట్ ఎయిర్‌లైన్స్ సర్వీసులు రెండు దేశాల మధ్య వారానికి అదనంగా 28 సర్వీసుల్ని పెంచుతున్నట్లు పేర్కొన్నారు ఆ సంస్థల ప్రతినిథులు. అబుదాబీకి 11 ఇండియన్ సిటీస్‌కి మధ్య 175 సర్వీసుల్ని (వారానికి) ప్రస్తుతం నిర్వహిస్తోంది. రెండు సంస్థలూ కలిసి 252 సర్వీసుల్ని నిర్వహిస్తున్నాయి. ఇకపై 18 నగరాలను కవర్ చేసేలా 280 విమానాల్ని నిర్వహఙంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. అబుదాబీ అహ్మదాబాద్‌కి ప్రస్తుతం ఉన్న సర్వీసుల్ని డబుల్ చేస్తారు. ఫిబ్రవరి 1 నుంచి డైలీ సర్వీసులు ఉంటాయి. అదే రోజు తిరుచురాపల్లి నుంచి అబుదాబీకి డైలీ సర్వీస్ ప్రారంభమవుతుంది. కన్నూర్ నుంచి అబుదాబీకి కూడా డైలీ సర్వీసులు 2017 రెండో అర్థభాగంలో ప్రారంభమవుతాయి. జనవరి 15 నుంచి ఢిల్లీ - అబుదాబీ నుంచి రెండో డైలీ సర్వీస్ ప్రారంభిస్తారు. ఇరు దేశాల మధ్యా కనెక్టివిటీని పెంచే దిశగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు ఎతిహాద్ ప్రతినిథులు చెప్పారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







