కేరళ రాష్ట్రంలోని పాఠశాలల పిల్లలకు డ్రగ్ చాక్లెట్లను విక్రయిస్తున్న బాగోతం ...
- October 28, 2016
కేరళ రాష్ట్రంలోని పాఠశాలల పిల్లలకు డ్రగ్ చాక్లెట్లను విక్రయిస్తున్న బాగోతం ఎక్సైజ్ అధికారుల దాడుల్లో వెలుగుచూసింది. సైకోట్రోపిక్ ఔషధాలు,వివిధ మత్తు పదార్థాలు, డ్రగ్స్ కలిపిన మాత్రలు, చాక్లెట్ల రూపంలో పాఠశాల పిల్లలు లక్ష్యంగా విక్రయిస్తున్నారని తేలింది. గంజాయి, డ్రగ్స్ స్మగ్లింగ్, విక్రయాలపై అధికారులు నిఘా పెంచడంతో వాటిని చాక్లెట్లలో కలిపి పాఠశాలల్లో పిల్లలకు విక్రయిస్తున్నారని వెల్లడైంది.
దీంతో ఎక్సైజ్ అధికారులు డ్రగ్ చాక్లెట్ విక్రయాలపై దృష్టి సారించారు. పదిరోజుల క్రితం పాలక్కాడులో ఎక్సైజ్ పోలీసులు మారువేషాల్లో వచ్చి డ్రగ్స్ కలిపిన 24 మౌత్ స్ర్పేలను స్వాధీనం చేసుకున్నారు. 4-అంగుళాల సీసాల్లో స్ట్రాబెర్రీ, నారింజ, యాపిల్ రుచులు కలిగిన డ్రగ్స్ మౌత్ స్ప్రేలను స్వాధీనం చేసుకున్నామని అసిస్టెంట్ ఎక్సైజ్ కమిషనర్ సులేష్ కుమార్ చెప్పారు. చైనా తయారు చేసిన ఈ డ్రగ్ ఉత్పత్తులను అక్రమంగా విక్రయిస్తున్నారని తేలిందన్నారు.
కోజికోడ్ లో ఎక్సైజ్ అధికారులు ఓ ఆలయ సమీపంలో డ్రగ్ తో తయారు చేసిన 705 నిట్రజేపం మాత్రలను స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్ మాత్రలు పాఠశాల విద్యార్థులకు విక్రయిస్తున్నారని అధికారుల దర్యాప్తులో తేలింది. మొత్తంమీద డ్రగ్ చాక్లెట్లు, మాత్రలకు పాఠశాల విద్యార్థులు అలవాటుపడుతున్నారని అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







