50 మంది కార్మికులకు అందని వేతనాలు, వసతి సౌకర్యం
- October 29, 2016
మనామా: డైర్ స్ట్రెయిట్స్ కాంట్రాక్టు కంపెనీకు చెందిన 50 మంది కార్మికులు తమకు సంబంధిత సంస్థ వేతనాలు, వసతి సౌకర్యం కల్పించకుండా వెలుపలికి తోసివేశారని శుక్రవారం భారత రాయబార కార్యాలయ సాయం కోరారు. అడ్లియా దౌత్యకార్యాలయం ప్రాంగణంలో శుక్రవారం ఉదయం జరిగిన ఓపెన్ హౌస్ కార్యక్రమంలో కార్మికులు పాల్గొని తమకు గత రెండు నెలల నుంచి వేతనాలు పొందడం లేదని పేర్కొన్నారు.మేము ఇక్కడ చిక్కుకొన్నామని జీతాలు ఇంతవరకు రాలేదు. సంస్థ మమ్ముల్ని తిరిగి ఇంటికి పంపేందుకు విమాన టిక్కెట్లు ఏర్పాటు చేసేందుకు నిరాకరించారని మంకు అనే ఒక కార్మికుడు తన ఆవేదన వ్యక్తం చేసాడు. వారు చివరికి దౌత్యకార్యాలయం జోక్యం చేసుకున్న తర్వాత తమ తమ పాస్పోర్ట్ తిరిగి లభించాయి అని తెలిపారు. భారతదేశంలో ఉన్నఒక నియామక సంస్థ ఇక్కడ ఉద్యోగాలు ఉన్నాయని తమకు తెలిపిన తరువాత ఈ బహరేన్ కు వచ్చినట్లు ప్రవాస కార్మికులు వెల్లడించారు. మేము నిర్విరామంగా ప్రయత్నిస్తున్నప్పటకీ మావద్ద ఏ డబ్బు లేదు, మాకు మా జీతాలు పొందడానికి సహాయం ఎంతో అవసరం. మేము ఇకపై ఇక్కడ పని చేయాలనీ అనుకోవడం లేదని తిరిగి భారతదేశం కు వెళ్లాలని ఆశ పడుతున్నట్లు మా కంపెనీ లో మేనేజర్ మమ్ముల్ని తీవ్రంగా ఇబ్బందులు పెట్టాడు. అంతే కాకుండా ఎప్పటికప్పుడు మమ్ముల్ని బెదిరించేవారని మంకు చెప్పారు.
తాజా వార్తలు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు







