మెయిడ్ అబ్‌స్కాండింగ్: స్పాన్సర్లకు ఊరట
- October 29, 2016
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, కొత్త విధానం తీసుకు వచ్చేందుకు సన్నద్ధమయ్యింది. జనవరి 17 నుంచి అమల్లోకి రానున్న ఈ విధానం ద్వారా, స్పాన్సర్లకు ఊరట కలుగుతుంది. ఒప్పందాల్ని ఉల్లంఘించి, మెయిడ్స్ అబ్‌స్కాండింగ్‌లోకి వెళ్ళిపోవడం లేదా వారిపై కేసులు నమోదవడం వంటి సందర్భాల్లో స్పాన్సర్లకు సమస్యలొస్తున్నాయి ఇప్పటివరకూ. తిరుగు ప్రయాణంలో వారికి టిక్కెట్లు చెల్లించాల్సి వస్తోంది. అయితే ఇకపై అలాంటి కేసుల్లో తిరుగు ప్రయాణానికి టిక్కెట్లు ఇవ్వాల్సిన అవసరం స్పాన్సర్లకు ఉండదు. పారిపోయిన, కేసుల్లో ఇరుక్కున మెయిడ్స్‌కి అక్రమంగా అవకాశాలు కల్పించేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా ఈకొత్త విధానంలో వెసులుబాటు కల్పిస్తున్నారు. అబ్‌స్కాండ్ అయినవారిని పట్టుకుని, వారిని విచారించి, షెల్టర్ ఇచ్చినవారెవరో కనుగొని, వారిని కూడా శిక్షించేలా జనరల్ డిపార్ట్‌మెంట్ ఫర్ రెసిడెన్స్ ఎఫైర్స్ చర్యలు తీసుకుంటుంది.
తాజా వార్తలు
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!







