ఎమిరేట్ ఏంజిల్, పిల్లల రాణి ఈ పాప’ అంటున్న రషీద్
- October 29, 2016నిండా పదేళ్లు కూడా లేని పాప.. ఏకంగా దుబాయ్ రాజు, యూఏఈ ప్రధానమంత్రి అయిన షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్టోమ్ను ఇమిటేట్ చేసిన సంగతి తెలిసిందే. ఓ సభలో రాజు చేసిన ప్రసంగాన్ని అనుకరించి మాట్లాడిన పాప వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియో కాస్తా రాజు దగ్గరకు చేరడం, పాప ముద్దు ముద్దు మాటలకు ఆయన కూడా మురిసిపోయి.. పాపను కలవాలనుకోవడం వెంటవెంటనే జరిగాయి. ‘ఈ పాపను కలవాలనుకుంటున్నాను. ఈమె వివరాలు తెలిసిన వాళ్లు చెప్పండి’ అని స్వయంగా ట్విటర్ వేదికగా రషీద్ అడిగిన వెంటనే.. వేల కొలది రిప్లైలు ట్విటర్లో వచ్చాయి. ఆమె పేరు ముహ్రా అల్ షేహీ అనీ, షార్జాహ్కు చెందిన పాప అని తెలిపారు. దీంతో షార్జాహ్లోని రాజు ఇంటికి పాప కుటుంబాన్ని అధికారులు తీసుకువచ్చారు. వారితో సరదాగా గడిపారు. పాప చదువు వివరాలు తెలుసుకున్నారు. పాపతో అక్కడ కూడా వీడియోలో ఇమిటేట్ చేసిన విధంగా మాట్లాడించుకున్నారు. సరదాగా రాజు ఇల్లంతా ఆ పాప తిరిగింది. గెంతులు వేస్తూ ఇల్లంతా సందడి చేసింది. ఒడిలో కూర్చోబెట్టుకుని పాపతో సరదాగా సంభాషించారు. షార్జాహ్ మోడల్ స్కూల్లో గ్రేడ్ వన్ చదువుతున్నట్లు షేహీ తండ్రి తెలిపారు. ఆ పాపకు తమ్ముడు అబ్దుల్లా (5), చెల్లి ఆస్మా(3) ఉన్నారు. ‘ నా కూతురు ముహ్రా అల్ షేహీతో ఓ రోజు గడిపాను. చాలా ఆనందంగా ఉంది. ఎమిరేట్ ఏంజిల్, పిల్లల రాణి ఈ పాప’ అంటూ రషీద్ ట్విట్ చేశారు. పాపతో సరదాగా గడిపిన ఫోటోలను కూడా పోస్ట్ చేశారు.. ఆ పాప మాట్లాడిన వీడియోను మీరూ చూడండి...
తాజా వార్తలు
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..